జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) పార్టీ నిధి కోసం రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు.ఈ క్రమంలోనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన -టీడీపీ కూటమి( Janasena-TDP ) అధికారంలోకి వస్తుందని తెలిపారు.పార్టీ కోసం పని చేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని పేర్కొన్నారు.2019 తరువాత పార్టీకి అండగా నిలిచిన వాళ్లకు భరోసా ఇచ్చానన్న పవన్ కల్యాణ్ కూటమిలో వచ్చే స్థానాలను మాత్రమే చూడొద్దని తెలిపారు.భవిష్యత్ లో మనకు మరిన్ని పదవులు రాబోతున్నాయని వెల్లడించారు.







