వైసీపీ పార్టీ కౌలు రైతులకు సరైన న్యాయం చెయ్యడం లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.గురువారం కాకినాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
పత్రికల్లో, ఛానల్ ల్లో కౌలు రైతుల ఆత్మహత్యలు, వార్తలు వస్తున్నాదాని పైన కూడ వైసీపీ పార్టీ నాయకులు హేళనగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.రైతుల కష్టాలపై సరైన తీరులో ముఖ్యమంత్రి స్పందించడం లేదని ప్రజలకు అర్ధమైందన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్నవారు రైతులే కాదని వారిని అవమానపరుస్తున్నారుని ఆరోపించారు.సంభందిత శాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు.అధికారులు ఎందుకు పత్రికా సమావేశాలు పెడుతున్నారని నిలదీశారు.ఎట్టకేలకు ఎనిమిది వందల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు అంగీకరించారు.
మరి వారందరికీ మీరు ఏడు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారా అని ప్రశ్నించారు.