టిడిపి తో పొత్తులో భాగంగా కీలక స్థానాల పైనే జనసేన పార్టీ( Janasena Party ) కన్నేసింది.ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు , ఉమ్మడి కృష్ణ జిల్లాలోనూ తమ పార్టీకి గట్టు పట్టు ఉందని జనసేన అంచనా వేస్తోంది.
అందుకే కీలకమైన స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.పొత్తులో భాగంగా కొన్ని సీట్లు తమకు కేటాయించాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చంద్రబాబు వద్ద డిమాండ్లు వినిపిస్తున్నారు.
ఇప్పటికే చంద్రబాబు, పవన్ కలిసి సీట్ల పంపకాలపై కీలకంగా చర్చలు జరిపారు.ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ జిల్లాలోని( Krishna District ) నాలుగు స్థానాల్లో కచ్చితంగా పోటీ చేయాలనే ఆలోచనకు జనసేన వచ్చింది.
ఈ మేరకు ఆ స్థానాల నుంచి జనసేన నుంచి బలమైన అభ్యర్థులే పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే ఆ స్థానాలలో టిడిపి అభ్యర్థులు తమకు సీటు కేటాయించాల్సిందే అని చంద్రబాబుపై ఒత్తిడి కొనసాగిస్తున్నారు.
దీంతో ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం రెండు పార్టీలకు తలనొప్పిగానే మారింది.జనసేన కోరుతున్న నియోజకవర్గలు చూసుకుంటే పెడన, కైకలూరు , అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ. అయితే ఈ నాలుగు నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ను జనసేనకు ఇచ్చేందుకు టిడిపికి ఎటువంటి అభ్యంతరం లేకపోయినా ,మిగిలిన మూడు నియోజకవర్గాల్లో టిడిపి నేతలు నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది.ఈ మూడు నియోజకవర్గాలలోనూ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.దీంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే తమకు గెలుపు అవకాశాలు ఉంటాయి అని జనసేన అంచనా వేస్తోంది.
పెడన :
ఈ నియోజకవర్గం విషయానికి వస్తే మచిలీపట్నం ఎంపీ బాలసౌరి( MP Balasouri ) కుమారుడి కోసం పెడన సీటును కేటాయించాల్సిందిగా జనసేన ఒత్తిడి చేస్తుంది.ఇదే అసెంబ్లీ సీటు, మాజీ మంత్రి టిడిపి నేత కాగిత కృష్ణ ప్రసాద్( Kagitha Krishna Prasad ) ఆశిస్తున్నారు.ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ భారీగా ఫ్లెక్సీలు నియోజకవర్గం అంతట కృష్ణ ప్రసాద్ ఏర్పాటు చేశారు దీంతో ఈ సీటు విషయంలో టిడిపి, జనసేన ఈ నిర్ణయానికి తెలియని ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.
అవనిగడ్డ :
అవనిగడ్డ సీటును పొత్తులో భాగంగా జనసేన ఆశిస్తుంది.అయితే ఇక్కడ సీటును వదులుకునేందుకు టిడిపి ఇష్టపడడం లేదు.మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్( Mandali Buddha Prasad ) ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.ఈ టిక్కెట్ ని జనసేన తమకు కేటాయించారు జనసేన అభ్యర్థిగా వికృత్తి శ్రీనివాస్ పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.ఇప్పటికి పవన్ కళ్యాణ్ కూడా కలిసిన ఆయన సీటు విషయమే పవన్ నుంచి హామీనీ తీసుకున్నారు.
విజయవాడ పశ్చిమ :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో పోతిన మహేష్( Pothina Mahesh ) ఇక్కడ యాక్టిివ్ గా ఉన్నారు.ఆయనకు టికెట్ ఇప్పించుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.అయితే ఇదే సీటుపై టిడిపి నుంచి జలీల్ ఖాన్, నాగుల్ మీరా ,బుద్ధ వెంకన్నలు పోటీ పడుతున్నారు.దీంతో ఈ సీటు విషయంలోనూ సందిగ్ధం నెలకొంది.
కైకలూరు :
ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి బిజెపి నేత కామినేని శ్రీనివాస్( Kamineni Srinivas ) ప్రయత్నిస్తున్నారు.బిజెపితో పొత్తు కుదిరితే బిజెపి అభ్యర్థిగా బరిలో ఉండేందుకు కామినేని శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు.ఒకవేళ టిడిపి బిజెపి పొత్తు లేకపోతే జనసేనలో చేరి అక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.
చంద్రబాబు నుంచీ కామినేని కి ఆశీస్సులు ఉండడం తో ఈ సీటు విషయంలో ఎటువంటి ఇబ్బందీ లేదు.