ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన( Janasena ) దూకుడు పెంచింది.రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లలో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో బరిలో దిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) సుమారు 22 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.కాగా ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన పార్టీగా జనసేన మారనుంది.
ఈ ఫలితాలతో గాజు గ్లాసు గుర్తును పూర్తిస్థాయిలో జనసేన పార్టీ సొంతం చేసుకోనుంది.