మంత్రి కేటీఆర్ కి సవాల్ విసిరిన జానారెడ్డి.. ఏమని అంటే.. ?

ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చే వరకు అమలు కానీ హమీలను ఇస్తుంది.వాటిని పిచ్చి జనం నమ్మి ఓటేస్తారు.

ఆ నాయకులకు అధికారం కట్టబెడతారు.ఇక పదవిలోకి వచ్చిన నేతలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? అంటే ఏదో బిచ్చం వేసినట్లుగా ఇచ్చిన హామీలల్లో నెరవేర్చడానికి వీలుగా ఉన్నవి అమలు చేస్తారు.ఓటు వేసే ముందే ప్రజలు ఆలోచిస్తే, మాటతప్పే నాయకుల వెంట పడవలసిన అవసరం ఉండదుగా.

ఇకపోతే అధికారంలోకి రాక ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హమీల విషయంలో కేటీఆర్ ని జానారెడ్డి ప్రశ్నించారు.తెలంగాణాలో సుమారు 4 లక్షల 90 వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ కాదా అంటూ విరుచుకు పడ్డాడు.

ఇక మంత్రి కేటీఆర్ కి జానారెడ్డి సవాల్ విసిరారు.అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది తెరాస.కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అన్నది తెరాస.

Advertisement

లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తే పిఆర్సీ కమిషన్ ఇచ్చిన లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఎక్కడినుండి వచ్చింది అని ఆయన ప్రశ్నించారు.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు