జగన్ పాలన పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన జనసేన నాయకురాలు రజనీ ..

జగన్( Ys jagan ) పాలనలో అన్నీ వైఫల్యాలే అని, ఆయన చెప్పుకుంటున్న నవరత్నాలు ఎపుడో రాలిపోయాయని జనసేన నాయకురాలు రజనీ ( Rajni )ఆరోపించారు.తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి చంటి, నాగోతి రామారావు, పోతినీడి లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ ఎన్నికల కార్యాలయంలో రజనీ మీడియాతో మాట్లాడారు.

 Jana Sena Leader Rajni Made Serious Comments On Jagan's Regime , Ys Jagan, Jan-TeluguStop.com

మైనారిటీలకు ఇస్లామిక్ ర్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఆ వర్గాలకు రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు.

రాజధానిగా అమరావతి( Amaravati ) వస్తే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం ప్రత్యేక వ్యాపార కేంద్రంగా మారి ఉండేదని వ్యాపారస్తులు చెబుతున్నారని, ఈ నియోజక వర్గానికి సుజనా చౌదరి( Sujana Chowdary ) ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రజనీ అన్నారు.

విజయవాడ పశ్చిమలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకలేదని, అందుకే ఎవరినో బరిలో దింపారంటూ రజనీ ఎద్దేవా చేశారు.మోదీ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న సుజనా అయితే విజయవాడ పశ్చిమ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని రజనీ వివరించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోతిన మహేష్ ఆరోపణలను ఆమె ఖండించారు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.అసెంబ్లీలోకి జగన్ అడుగు పెట్టనివ్వకుండా పులివెందులలో ఓడించాలని ప్రజలకు రజనీ పిలుపునిచ్చారు.

పాతబస్తీని కొత్తబస్తీగా మార్చే శక్తి సుజనాకే ఉందని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube