వచ్చే ఎన్నికల కోసం జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళాలా లేక పోత్తుల వెళ్ళాలా వెళ్తే ఎవరితో కలిసి వెళ్ళాలనేది దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తుంది.
అధికార పార్టీ కి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను చీల్చడం ఇష్టం లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులతో వెళ్ళాలని చూస్తున్నారు. అదే సమయంలో తాను కాబోయే ముఖ్యమంత్రిని ఏపీ ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.
రెండు ప్రకటనలు పరస్పర విరుద్ధమైనప్పటికీ, పవన్ మాత్రం ఆ పదివిపై ఆస్తకి కనబరుస్తున్నారు.పవన్ సెలబ్రిటీ కావడంతో, ప్రజలు పెద్ద సంఖ్యలో అతని సమావేశాలకు వస్తున్నారు.
అతని ప్రసంగాలను చప్పట్లతో స్వాగితిస్తున్నారు. కానీ గ్రౌండ్లో వాస్తవికత భిన్నంగా ఉంది.
పొత్తుల విషయానికి వస్తే.వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు ‘రోడ్ మ్యాప్’ ఇవ్వలేదని బీజేపీపై పవన్ విరుచుకుపడ్డారు.
అయితే ప్రధాని మోదీ పర్యటన తర్వాత పవన్ మౌనంగా ఉన్నారు. బీజేపీ, జనసేన పొత్తును యథాతథంగా కొనసాగిస్తున్నాయా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. అయితే రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ చెప్పినట్లుగా అన్నీ సర్దుకుపోతాయనే భ్రమలో పవన్ ఉన్నాడు.ప్రధాని మోదీ హామీ ఇచ్చినప్పటికీ, బీజేపీతో జనసేన సంతోషంగా లేదనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఏపీకి మద్దతు ఇస్తానన్న బీజేపీపై జనసేన విశ్వాసం కోల్పోవడమే కారణం. చాలా గ్యాప్ తర్వాత బీజేపీ, జనసేన కలిసి కొన్ని పొరాటాలు బోతున్నాయని వార్తలు వచ్చాయి.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ‘గుడ్ గవర్నెన్స్’ అనే అంశంపై బీజేపీ కాన్ఫరెన్స్ ప్లాన్ చేసి, జనసేన నేతలకు కూడా ఆహ్వానాలు పంపింది. అంతేకాదు ఈ కాన్ఫరెన్స్ వివరాలను మీడియాకు లీక్ చేశారుఏపీ బీజేపీ నేతలు.అయితే బీజేపీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని జనసేన నేతలు ఖండించారు. బీజేపీతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు, పొత్తుల గురించి చర్చించే ఉద్దేశం తమకు లేదని జనసేన స్పష్టం చేసింది.
అందుకు చాలా సమయం ఉందని జనసేన నేత ఒకరు తెలిపారు.ఏపికి సంబంధించి పక్కా ప్రణాళిక లేని బిజెపికి జనసేన దూరం కావాలని ఈ సంఘటన సూచిస్తోంది.
దీంతో బీజేపీతో జతకట్టేందుకు జనసేన భయపడుతోంది.







