2024 ఎన్నికల నాటికి టిడిపి( TDP ) తో పొత్తు పెట్టుకునే ఆలోచనతో జనసేన( Janasena) ఉంది .దీనిపై ఇటీవల మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ దీనిపై సంకేతాలు ఇచ్చారు.
ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బలిపశువును కాను అంటూ పవన్ ప్రకటించడంతో టీడీపీ కూడా పొత్తుపై ఆశలు పెంచుకుంది.ఇది ఇలా ఉంటే జనసేన టిడిపిలో పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాకముందే, అధికారికంగా పొత్తు పెట్టుకోక ముందే, అప్పుడే టిడిపి తో జనసేన కటీఫ్ చేసుకుంటుంది అనే బెదిరింపులు జనసేన నాయకులు , ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న కీలక వ్యక్తుల నుంచి వస్తుండడం సంచలనంగా మారింది.
దీనిపై టిడిపి సోషల్ మీడియాలోనూ సెటైర్లు వస్తున్నాయి.జనసేన లోని ఇటువంటి నాయకులు వల్ల పవన్( pawan kalyan ) నష్టపోతున్నారని , పవన్ అసెంబ్లీకి వెళ్ళకుండా చేస్తున్నారంటూ టిడిపి మద్దతుదారులు సెటైర్లు వేస్తున్నారు.

అసలు ఈ వ్యవహారం చోటు చేసుకోవడానికి కారణం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి పాత్ర ఉందని, ముఖ్యంగా లోకేష్ చంద్రబాబు ( Lokesh Chandrababu )దీనికి సూత్రధారులని , భారీగా అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు.దీనిపై విచారణ కూడా చేయిస్తామంటూ జగన్ ప్రకటించడం తదితర అంశాలపై జనసేనకు ప్రధాన మద్దతు దారుడిగా ఉన్న కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, సీనియర్ పొలిటిషన్ చేగొండి హరి రామ జోగయ్య స్పందించారు.స్కాంలో చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాలని, లేకపోతే టిడిపిని వదిలేసి తమ దారి తాము చూసుకుంటామంటూ జనసేన తరఫున జోగయ్య లేఖను విడుదల చేశారు.అయితే ఈ విషయంలో పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు.

అసెంబ్లీలోనే జగన్ ఈ స్కిల్ స్కాం పై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడడు అంటూ జగన్ ప్రశ్నించారు.టిడిపి తో తాము కలవాలంటే ఈ విషయంలో నిజాయితీ నిరూపించుకోవాలని జనసేన తరఫున ఆయన డిమాండ్ వినిపిస్తున్నారు.దీనిపై జనసేనలోనూ తీవ్ర అసంతృప్తి నెలకుంది.తమ పార్టీ అధినేత పవన్ ఈ వ్యవహారంపై స్పందించకుండానే జాబు ఈ విధమైన ప్రకటనలు చేయడం , అంతిమంగా వైసిపికి కలిసి వస్తుందని, అసలు పోత్తే పెట్టుకోకుండా తమ దారితాము చూసుకుంటామంటూ జోగయ్య ప్రకటన చేయడం జనసేనకే నష్టం కలిగిస్తుందని జన సైనికులు సోషల్ మీడియాలో వాపోతున్నారు.
మరి ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో ?
.






