పవన్ అభిమానులకు పూనకాలే.. జల్సా కొత్త ప్రింట్ అంటూ డైరెక్టర్ ట్వీట్!

పాత సినిమాలను తిరిగి ప్రస్తుతం విడుదల చేయడం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ అవుతుంది.అభివృద్ధి చెందిన టెక్నాలజీకి అనుగుణంగా పాత సినిమాలను 4కే రిజల్యూషన్‌, డాల్బీ ఆటమ్స్‌ సౌండ్‌తో సినిమాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు.

 Jalsa Movie Re Release With 4k Hd Quality On Pawan Kalyan Birthday Details, Pawa-TeluguStop.com

ఇప్పటికే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన పోకిరి సినిమాని పలు థియేటర్లలో విడుదల చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.73 కోట్ల వసూలను రాబట్టి మరో రికార్డ్ సృష్టించింది.ఈ విధంగా పోకిరి సునామి సృష్టించడంతో మరికొన్ని సినిమాలు కూడా తిరిగి విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ రెండవ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన జల్సా సినిమా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.

ఈ సినిమా వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో తిరిగి ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొత్త ప్రింట్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని ప్రముఖ రచయిత డైరెక్టర్ సాయి రాజేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తాను జల్సా సినిమా కొత్త ప్రింట్ చూశానని ఇందులో బాబు అప్పుడే కొన్న కొత్త అద్దంలా మెరిసిపోతున్నారని పవన్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టండి అంటూ ఈయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube