తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి రాజీనామా చేస్తున్నానన్న వ్యాఖ్యలతో ఒక్కసారిగా అలజడి రేగిన విషయం తెలిసిందే.అయితే జగ్గారెడ్డి రాజీనామా విషయంపై ఒక క్లారిటీ ఇచ్చిన తరువాత రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి అంశం టీ కప్పులో తుఫాను లాంటిదని, కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే జగ్గారెడ్డి విషయం టీ కప్పులో తుఫాను వంటి దని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తన వ్యవహారాన్ని టీ కప్పులో తుఫాను లాంటిదని కొట్టిపారేసే ముందు ఎందుకు ఈ సమస్య వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నించాలని అప్పుడు నా ఆవేదన ఏంటిదని అర్ధమవుతుందని అన్నారు.
అయితే ఈ సందర్భంగా తన రాజీనామా విషయంపై కూడా జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.రాజీనామా నిర్ణయాన్ని 15 రోజుల వరకు వాయిదా వేసుకుంటున్నానని సీనియర్ నేతలు సలహాను గౌరవించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.15 రోజులలోగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పించాలని ఒకవేళ అపాయింట్ మెంట్ ఇప్పించక పోతే రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించు కునేది లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.అయితే నా సమస్య రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ పరిష్కరించ వచ్చునని కాని పరిష్కారానికి నోచుకోక పోవడం వలనే రాజీనామా నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని జగ్గారెడ్డి అభిప్రాయ పడ్డారు.

ఏది ఏమైనా జగ్గారెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో ఇంకెంతగా అలజడి సృష్టిస్తుందనేది చూడాల్సి ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడి ప్పుడే బలపడుతున్న తరుణంలో జగ్గారెడ్డి వ్యవహారం మరోసారి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో చర్చకు దారి తీసిన పరిస్థితి ఉంది.అయితే జగ్గారెడ్డి వ్యవహారంపై మాణిక్యం ఠాగూర్ ఇప్పటికైతే స్పందించకపోయినా రానున్న రోజుల్లో స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.





 

