టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు జగపతిబాబు(Jagapathi Babu) ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఈయనకు హీరోగా అవకాశాలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే ఈయనకు తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ హీరోగా కాకుండా విలన్ పాత్రలలో నటించే అవకాశం రావడంతో ఈయన విలన్ (Villain) పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కానీ జగపతిబాబుకి హీరోగా కంటే విలన్ పాత్రలే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయని పలు సందర్భాలలో ఈయన వెల్లడించారు.

ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో కూడా ఈయన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను జగపతిబాబు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను ఒక సలహా అడిగారు.
తనకు హాలీవుడ్ (Hollywood) సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి వెళ్ళమంటారా అంటూ ఈయన అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఇలా జగపతిబాబుకి హాలీవుడ్ సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటూ అభిమానులకు తెలియజేయడంతో కొందరు ఈ పోస్ట్ పై స్పందిస్తూ హాలీవుడ్ అవకాశాలు రావడం అంటే నిజంగా గ్రేట్ మీరు అక్కడికి వెళ్లి మీ సత్తా ఏంటో అక్కడ కూడా చూపించండి అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొందరు హాలీవుడ్ ఇండస్ట్రీని కూడా దున్నేయండి అంటూ కామెంట్ చేయగా మరి కొంతమంది నేటిజన్స్ హాలీవుడ్ ఇండస్ట్రీ మిమ్మల్ని భరించగలరా అంటూ ఈయనపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.ఇలా తనకు హాలీవుడ్ సినిమా అవకాశం వచ్చిందని చెప్పినటువంటి జగపతిబాబు ఏ సినిమా ఏంటి అనే ఇతర వివరాలను తెలియజేయలేదు.







