కొన్ని కాంబినేషన్స్ కు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ ఉంటుంది .అలానే కొన్ని కాంబినేషన్స్ మల్లి రిపీట్ అయితే ప్రేక్షకులు చూడటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు.
ఒక్కోసారి నెగిటివ్ రోల్స్ చేసే యాక్టర్స్ కూడా మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది .అసలు ఇంతకీ ఈ కాంబినేషన్ గోల ఏమిటి ? అనేగా మీ డౌట్ ?ఇక అసలు విషయానికి వస్తే .ఫ్యామిలీ హీరో జగపతి బాబు కు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది ,హీరో నుండి విలన్ , సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు హీరో జగపతి బాబు .అలానే ప్రస్తుతం హీరో జగపతి బాబు కు టాలివుడ్ ఇండస్ట్రీ తో పాటు తమిళ్ ,బాలీవుడ్ కోలీవుడ్ వరకు ఫుల్ డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు.ఒక నటుడిగా అన్ని సినిమాలు చెయ్యాలి , అన్ని రకాల పాత్రలు చేయాలి , అన్ని రకాల జానర్ సినిమాలు చెయ్యాలి అని స్టార్ హీరోస్ అనుకుంటారు.
అలానే హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆ హీరోలు చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అయ్యేయి .హీరోస్ సినీ కెరీర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము ,కెరీర్ ఫుల్ పీక్ లో ఉన్నప్పుడు హీరోగా చేసిన సినిమాలు అన్ని సక్సెస్ అవుతాయి ,అయితే కెరీర్ లో ప్లాప్ మీద ప్లాప్ వస్తే మాత్రం ఆ హీరో కెరీర్ సడెన్ గా డౌన్ ఫాల్ అవుతుంది .ఇక హీరో జగపతి బాబు కెరీర్ కూడా అలా డౌన్ ఫాల్ అయింది .ఇక సరిగ్గా అదే సమయంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను లెజెండ్ సీనిమాలో హీరో జగపతి బాబు కి విలన్ రోల్ లో అవకాశం ఇచ్చారు.ఇక ఈ సినిమా ట్రైలర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , బాలయ్య యాక్టింగ్ ,జగపతి బాబు విలనిజమ్ ,బోయపాటి టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది .ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించిన హీరో జగపతి బాబు యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇక లెజెండ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో హీరో జగపతి బాబు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.ఇక లెజెండ్ సినిమా తో హిట్ అందుకొని యు -టర్న్ తీసుకొని నెగిటివ్ రోల్ లో కనిపించిన హీరో జగపతి బాబు నటనకు ప్రేక్షకులు ,ఇండస్ట్రీ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు .ఇక లెజెండ్ సినిమా తరువాత జగపతి బాబు నటించిన రంగస్థలం ,నాన్నకు ప్రేమతో ,మహర్షి , విశ్వాసం ఇలా అన్ని సినిమాల్లో ను వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.ఇక అసలు విషయానికి వస్తే .2018 లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ – యంగ్ టైగెర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ అరవింద సమేత వీర రాఘవ .ఈ సినిమా లో విలక్షణ నటుడు జగపతిబాబు విలన్ రోల్ లో బసిరెడ్డి గా కనిపించి తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఇండస్ట్రీ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు.

ఇక మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళితే .ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ వినిస్తుంటుంది .త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ బాబు ఎస్ ఎస్ ఎం బి 28 వ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి .అతడు ,ఖలేజా వంటి క్లాసిక్ హిట్ మూవీల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు బాగా పెరిగిపోయాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ఈ సినిమా మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు అని తెలుస్తుంది .తాజగా ఈ సినిమా లో విలన్ రోల్ లో ఎవరు నటిస్తున్నారో అనే విషయం బయటకు వచ్చింది .ఈ సినిమాలో విలన్ రోల్ లో హీరో జగపతి బాబు నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్థున్నాయి.

అరవింద సమేత వీర రాఘవ సినిమా లో బసిరెడ్డి గా జగపతి చేసిన క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా అలరించింది .ఇక ఈ సినిమాలో కూడా జగపతి బాబు చేసే క్యారెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ విధంగా డిజైన్ చేశారో అనే ఆసక్తి మహేష్ అభిమానుల్లో ఉంది .ఇక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది.ఆయన ఎవరో కాదు జగపతిబాబు.ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని కూడా ఆయన తెలిపారు .ఇక ఫైనల్ గా జగపతి బాబు చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి ,ఇక మొత్తానికి మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో జగపతి బాబు నటిస్తున్నారు అనే విషయంలో ఫుల్ క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ లుక్ గాని అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంతవరకు ఎదురుచూడాలసిందే .







