ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.జగన్ పాలనపై ప్రజలు రగిలిపోతున్నారని చెప్పారు.
జీవో నెంబర్-1 ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికే వర్తిస్తుందా.? వైసీపీకి వర్తించదా.? అని ప్రశ్నించారు.చంద్రబాబుకు తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా అని నిలదీశారు.
టీడీపీ హయాంలో ఇలాంటి జీవోలు తీసుకువస్తే వైసీపీ జెండా కనిపించేదా అని నిలదీశారు.







