జగన్ బీసీ మంత్రం.. టీటీడీకి కొత్త చైర్మ‌న్‌గా బీసీ నేత!

రానున్న ఎన్నికల దృష్ట్యా ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీలో కీలక మార్పులు చేయనున్నారు.

 Jagans Bc Mantra Bc Leader As The New Chairman Of Ttd , Tirumala Ananda Nilayam,-TeluguStop.com

 రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని బీసీల‌కు అధిక పాధన్యతను ఇవ్వాలని   నిర్ణ‌యించారు.వైవీ సుబ్బరెడ్డి త్వరలో టీటీడీ చైర్మన్ పదవి నుండి తప్పుకోనున్న నేపథ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్‌గా బీసీ నేత  జంగా కృష్ణ‌మూర్తిని నియ‌మించేందుకు ప్రణాళికలు సిద్దచేస్తున్నారు.

త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలుబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత టీటీడీ పాల‌క మండ‌లి  వ‌చ్చే ఏడాది ఆగ‌స్టులో రద్దు కానుంది.

  అయితే వైవీ సుబ్బారెడ్డిని ఇనాళ్ళు పార్టీకి దూరం పెట్టిన జగన్ తాజాగా  ఉత్త‌రాంధ్ర వైసీపీ బాధ్య‌త‌ల‌ను అప్పగించారు.ఈ నేపథ్యవలో  వైవీ సుబ్బరెడ్డి టీటీడీ బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో  ఆ ప్రాంతంలో పార్టీ మరింతగా పటిష్టం చేయడంపై ఆయన  దృష్టి పెట్టనున్నారు.ఇప్పటికే టీటీడీ చైర్మ‌న్ బాధ్య‌త‌ల త‌ప్పుకునే ప్రక్రియపై దృష్టి పెట్టారు.

  వైకుంఠ ఏకాదశి అనంతరం ఆయన చైర్మ‌న్ బాధ్య‌త‌ల నుంచి వైవీ వైదొలుగుతారు.

Telugu Tirumalaananda, Tirupatiananda-Political

ఆయన తప్పుకున్న వెంటనే టీటీడీ కొత్త చైర్మ‌న్‌గా బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణ‌మూర్తిని నియమించే అవకాశం ఉంది.కృష్ణ‌మూర్తి  యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌.  ప్రస్తుతం గుర‌జాల‌  పార్టీ వ్వవహారాలు చూస్తున్న ఈయన గతంలో వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ప‌ని చేశారు.

పార్టీ చేసిన  సేవ‌ల్ని గుర్తించిన జగన్.  కృష్ణ‌మూర్తికు  ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు.  కృష్ణ‌మూర్తికి టీటీడీ చైర్మ‌న్‌ పదవి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో  బీసీల‌కు వైసీపీ  అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాల‌ను జగన్  ఇవ్వనున్నారు .

Telugu Tirumalaananda, Tirupatiananda-Political

ఎన్నికల సమయంలో సామాజిక  సమీకరణలపై  పార్టీలు దృష్టి పెట్టడం సంప్రదాయంగా మారింది.గ‌తంలో కూడా చంద్ర‌బాబు  పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు టీటీడీ చైర్మ‌న్‌గా నియమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube