ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మరింతగా అలర్ట్ అవుతున్నారు.రెండోసారి వైసీపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలను ఇప్పటికే ప్రారంభించారు.
వైసీపీ పై ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గకుండా, మరింత బలోపేతం అయ్యేవిధంగా ఏం చేయాలనే విషయంపైన దృష్టి పెట్టారు.దీనికితోడు వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలతో జగన్ మరింతగా దూకుడు పెంచారు.
ఈ నేపథ్యంలోనే మూడేళ్ల విరామం అనంతరం వైసిఎల్పి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు జగన్ దిశా నిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం.
ప్రజల్లో ఆదరణ ఏ విధంగా పెంచుకోవాలి ? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి ? వారికి ఏ విషయం చెప్పాలి ? మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఎంత మేలు చేసింది ఇలా అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే విషయమై వైసిపి ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారట.
అంతేకాదు ఇప్పటి వరకు ఎమ్మెల్యేల పనితీరుపైన, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఏమిటి ఇలా అనేక అంశాలకు సంబంధించిన నివేదికలను జగన్ బయట పెట్టబోతున్నారట.
ఈ సందర్భంగా ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్వయంగా జగన్ క్లాస్ పీకబోతున్నారట.వారు తమ పనితీరు ఏ విధంగా మార్చుకోవాలి ? రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఏం చేయాలి అనే విషయం పైన జగన్ దిశా నిర్దేశం చేయబోతున్నారట.అలాగే త్వరలో చేపట్టనున్న మత్రి వర్గ విస్తరణ అంశంపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం మంత్రులలో పదవులు కోల్పోయిన వారికి పార్టీ పదవులు ఇవ్వబోతుండడంతో వారు ఏ విధంగా పని చేయాలి అనే విషయం పైన జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నారట.అలాగే నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , అది పార్టీని దెబ్బ తీస్తూ ఉండటం వంటి అంశాల పైన జగన్ ఘాటుగానే మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.