మహిళా కార్డు ప్రయోగించబోతున్న జగన్?

రాష్ట్రంలోని మెజారిటీ మహిళల సంక్షేమమే లక్ష్యం గా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ఇప్పుడు ఎన్నికల సమరంలో కూడా మహిళా కార్డుతోనే ఎదుర్కోవాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రదమ లబ్ది దారులు మహిళ లే కాబట్టి తనకు మహిళా లోకంలో విపరీతమైన ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్న జగన్ ఆ ఆదరణను ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

 Jagan Who Is Going To Use Women's Card, Womens Card, Ys Jagan , Ap Politics , Yc-TeluguStop.com

ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో మహిళలకు దాదాపు 40 శాతం టికెట్లను కేటాయించబోతున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ప్రతిపక్షాలు రోజురోజుకీ బలం పుంజుకుంటూ సవాలు విసురుతున్నందున మహిళా అభ్యర్దు లను నియమిస్తే ఆయా నియోజకవర్గాలలో సెంటిమెంటు కలిసి వస్తుందన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తుంది.

Telugu Ap, Jana Sena, Pawan Klayan, Womens, Ys Jagan-Telugu Political News

రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన సామాజిక వర్గాలకు చెందిన బీసీ మహిళా నేతలను గుర్తించే పనిలో పడిందట వైసీపీ అధిష్టానం( YCP ).చాలాచోట్ల రెబల్ అభ్యర్థుల తలనొప్పులు అధికమవడంతో మహిళా అభ్యర్థి అయితే విజయం తధ్యమని భావిస్తున్న జగన్ ఈ విధంగా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయబోతున్నారట .అంతేకాకుండా ఈసారి వెనుకబడిన తరగతులకు చెందిన సామాజిక వర్గాలకు కూడా టికెట్ల కేటాయింపులో అదిక ప్రాముఖ్యత నివ్వాలని తద్వారా పేదలకు పెద్దలకు మధ్య యుద్ధం అని తాము చూపుకుంటున్న సమీకరణకు న్యాయం చేసినట్టు అవుతుందని బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు అప్పుడు పార్టీకి మరింత అండగా నిలబడతాయి అన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా వైసిపి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Telugu Ap, Jana Sena, Pawan Klayan, Womens, Ys Jagan-Telugu Political News

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) నాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై మహిళ అస్త్రాన్ని ప్రయోగించి సెంటిమెంట్ రగల్చడం లో విజయవంతమైనందున వచ్చే ఎన్నికలలో మహిళలకు అదిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా మంచి ఫలితాలను అందుకోవచ్చు అని జగన్ లెక్కలు కడుతున్నట్లుగా తెలుస్తుంది.అయితే ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరుకు మించిన కీలక నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో కొత్త సమీకరణకు నేతలను ఒప్పించడం కూడా కత్తి మీద సామే అవుతుంది.దాదాపు 50 నియోజకవర్గాలలో వైసిపి పార్టీకి ఈ రెబల్ అభ్యర్థుల తలపోటు తప్పదని విశ్లేషణలు వస్తున్నాయి మరి అసంతృప్తిల జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube