జగన్ ( CM Jagan Mohan Reddy ) ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న వర్గాలలో ఉద్యోగ వర్గం కూడా ఒకటి .ఆ వర్గానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆకాంక్షలను పట్టించుకోలేదు అన్నది వారి ప్రధాన ఆరోపణ.
ఇప్పటికే ఈ దిశగా అనేక ఉద్యమాలు కూడా ఉద్యోగ వర్గాలు( AP Govt Employees ) చేశాయి .గత పిఆర్సి నివేదికలు( PRC ) అమలు చేయకపోవడం .ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని( OPS ) తిరిగి పునరుద్ధరిస్తామన్న హామీని నిలబెట్టుకోకపోవడం,
జీతాలు పెంపు అమలు వాయిదా వేయడం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంలో నిర్లక్ష్యం చూపడం ఇలా అనేక కారణాలతో ఉద్యోగ వర్గాలు జగన్ ప్రభుత్వం కు వ్యతిరేకంగా మారాయి వచ్చే ఎన్నికల్లో ఈ వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాయని అంచనాలు ప్రభుత్వానికి అందినట్లుగా తెలుస్తుంది .ఎన్నికల సంవత్సరం అయినందున అనేక వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని బుజ్జగించే ప్రయత్నాలను ప్రభుత్వం మొదలుపెట్టిందని తెలుస్తుంది .

12వ పిఆర్సి ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది.ఉద్యోగ వర్గాల సూచనలను అన్ని లెక్కల్లోకి తీసుకొని వారిని ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తద్వారా వారి వ్యతిరేకతను తొలగించి తిరిగి పాజిటివ్ వాతావరణ తీసుకురావాలనే లక్ష్యంగా ప్రభుత్వం చకచగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి ఏ ప్రభుత్వానికి మంచిది కాదు.గత చంద్రబాబు హయాంలో కూడా ఆయన వోటమికి ప్రధాన కారణలు లో ఉద్యోగ వర్గాలవ్యతిరేకతను కూడా కారణంగా చెబుతారు .

గత మూడు సంవత్సరాలుగ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉదాసీన వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు సమయం కోసం వేచి చూస్తున్నాయి.వచ్చే ఎన్నికలలోవీరిని సంతృప్తి పరచకపోతే ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయన్న భావనకు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది .మరి ఈ చర్యలు వారిపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాలి
.