ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంలో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు.వీరిలో 90 శాతం మంది రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ నుంచి అవుట్ కానున్నారు.
జగన్ వీరిని కేబినెట్లోకి తీసుకున్నప్పుడే సగం కాలం తర్వాత 90 శాతం మంత్రులను తప్పించేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు.ఇక ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో శాఖ మీద పట్టు ఉన్నదెవరికో ఇంకా తెలియదు.
మరికొందరు ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉన్నాయన్న విమర్శలూ ఉన్నాయి.అసలు కొందరు అయితే మంత్రులుగా ఉన్నారా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు సరిగా రాబట్టలేని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించేస్తానని జగన్ ఇప్పటికే చెప్పేశారు.ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.ఒకరిద్దరు మంత్రులు మినహా చాలా మంది మంత్రులు పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలే రాబట్టారు.ఇక ఇప్పుడు మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆ తర్వాత మండల, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి.వీటిల్లో ఏ మంత్రి అయితే తమ నియోజకవర్గాలు లేదా తమకు బాధ్యత అప్పగించిన జిల్లాల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టరో ఆ మంత్రులకు జగన్ షాక్ తప్పదనే అంటున్నారు.

కొన్ని జిల్లాలకు ఇద్దరేసి మంత్రులు కూడా ఉన్నారు.ఆయా జిల్లాలో బాగా పనిచేసే వారు ఎవరు, అసమర్ధులు ఎవరు అన్నది ఎవరు అన్నది కూడా సులువుగా తేలిపోతుంది.స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రుల విషయంలో జగన్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది.ఇక కేబినెట్ మార్పుల్లో పనితీరుతో పాటు ప్రాంతాలు.సామాజిక సమీకరణలు అన్నీ బేరీజు వేసుకుని మార్పులు.చేర్పులు ఉండనున్నాయి.
ఏదేమైనా అన్ని స్థానిక ఎన్నికల తర్వాత జగన్ అసలు సిసలు ఆపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది.