వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేపట్టి సీఎం చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.బాబును ఎక్కడికక్కడ ఎండగట్టాడు.
నాడు బాబు పొత్తులపై జగన్ వేసిన పంచులు బాగా పేలాయి.వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తే తనదైన స్టైల్‌లో గట్టి కౌంటర్లు ఇచ్చారు.
ఇక అధికారంలోకొచ్చిన తరువాత , జగన్ సీఎం అయిన తరువాత స్తబ్ధుగా ఉన్నాడు.ప్రస్తుత బడ్జెట్ సెషన్‌లో జగన్‌ను చూస్తుంటే కొత్త జగన్‌ను చూసినట్టే ఉంటోంది.
బాగా మారిపోయారనిపించక మానదు.ఎందుకంటే తన పంచ్ డైలాగ్‌లతో టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకు పడ్డారు.
దీన్ని బట్టి మనం పాత జగన్‌ను చూస్తున్నామనుకోక తప్పదు.ఇప్పటి వరకు అంటే మూడేండ్లుగా పవర్‌లో ఉన్న సీఎం జగన్‌లా కనిపించడం లేదు.
గతంలో లేని హుషార్ నేడు జగన్‌లో కనిపిస్తోంది.
బడ్జెట్ సెషన్ సభలో జగన్ నవ్వుతూ మాట్లాడారు.
వరుస బెట్టి పంచు డైలాగులు వేసి సభ్యులను నవ్వింపజేశారు.సభలో వివిధ సందర్భాల్లో జగన్ చేసిన ప్రసంగాలతో సభ్యలు నవ్వుల్లో మునిగి తేలారు.
ప్రధానంగా ప్రత్యర్థులపై తనదైన శైలిలో బాణాలు సంధించారు.మద్యపానం విషయంలో నారా కాదు సారా చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీ చివరి రోజు కూడా బాబుని ఏకిపారేశారు.తాము పేదలకు వెల్ఫేర్ పథకాలు ప్రవేశపెడుతున్నామని, దానికి వెల్ఫేర్ క్యాలండర్ రెడీ చేశామని, ఇది చంద్రబాబుకు ఫేర్‌వెల్ క్యాలండర్ అని కామెంట్ చేశారు.
ఈ పంచ్ అధికార పక్షానికి జోష్‌నిచ్చింది.ఇక పోలవరం ఎత్తు గురించి మాట్లాడుతూ.
బాబు రాజకీయంగా ఎదగకుండా ఎత్తు తగ్గించేస్తామనడం సభలో హైలెట్ అయింది.పోలవరం ఎత్తు తగ్గించామని ఎవరు చెప్పారు ? ఈనాడు రామోజీరావుకు మోడీ ఫోన్ చేసి చెప్పారా ? ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణకు కేంద్రమంత్రి షెకావత్ చెప్పారా ? అంటూ వారిని అనుకరిస్తూ మాట్లాడిన తీరు నవ్వులు పూయించింది.

మరోవైపు మద్యం బ్రాండ్స్ అన్ని జే బ్రాండ్స్ కాదని చంద్రబాబు సీ బ్రాండ్స్ అని పంచులేసి అధికార పార్టీలో జోష్ పెంచారు.వైసీఎల్పీ సమావేశంలో కూడా చంద్రబాబు నథింగ్ అంటూ .ఆయనని లైట్ తీస్కోమని చెప్పారు.ఇదంతా చూస్తుంటే జగన్ మారిపోయారా అన్న చర్చ సాగుతోంది.
నిత్యం సీరియస్‌గా ఉండడమే కాదు.సభ సబ్జెక్ట్ మీదనే వెళ్తుంది.
ఎప్పుడు పంచులు ఉండవు.అలాంటి జగన్ నేడు జోరు పెంచడం ఆసక్తికరంగా మారింది.
ఇదంతా వచ్చే రెండేండ్లలో ఎన్నికల కోసమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఈక్రమంలో పార్టీ కేడర్‌లో ధైర్యాన్ని నింపడంతోపాటు ప్రత్యర్థులకు చెక్ పెట్టడానికని తెలిసింది.
ఇక వైసీపీ ప్లీనరీ అనంతరం ప్రజల మధ్యలోకి రావాలనుకుంటున్నారట.మరి అప్పుడు ఇంకెన్ని పంచులు పేలుస్తారో ? వేచి చూడాలి.