జగన్ అవినాష్ రెడ్డికి హ్యాండ్ ఇస్తున్నారా?

కాంగ్రెస్కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల నుంచి అధికారం సాధించే వరకు కూడా తన వెన్ను దన్నుగా నిలబడిన అవినాష్ రెడ్డి( Y.S.Avinash Reddy ) కుటుంబానికి జగన్ హ్యాండ్ ఇస్తున్నారా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అవినాష్ రెడ్డికి ప్రత్యామ్నాయం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు .వస్తున్నాయి .వివేకానంద రెడ్డి హత్య కేసు( Viveka Murder Case ) కీలక దశకు చేరుకున్నందున ఈరోజో రేపో వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి ….కొంతకాలం జైల్లో గడపకు తప్పని పరిస్థితి అవినాష్ కు ఎదురవుతుంది.

 Jagan Making Alternative For Avinash Reddy, Y. S. Avinash Reddy , Viveka Murder-TeluguStop.com
Telugu Abhishek Reddy, Ap, Viveka, Avinash Reddy, Ys Jagan-Telugu Political News

బెయిల్ పై బయటకు రాగలిగినప్పటికీ ఈ కేసు పై సిపిఐ చూపుతున్న ప్రదాన్యత దృష్ట్యా ఇది తేలే వరకు ఆయన పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాలు కనబడటం లేదు … తద్వారా కడపలో పార్టీ పరిస్థితి దిగజారే అవకాశం ఉందని గ్రహించిన జగన్ ఇప్పుడు అవినాష్ రెడ్డికి ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చారని తెలుస్తుంది.

Telugu Abhishek Reddy, Ap, Viveka, Avinash Reddy, Ys Jagan-Telugu Political News

వైయస్ అవినాష్ రెడ్డి పెదనాన్న ప్రకాష్ రెడ్డి మనవడు అయిన అభిషేక్ రెడ్డి కి ( Abhishek Reddy ) కడప పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఈయన విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు 2019 ఎన్నికలలో పార్టీ తరఫున ప్రచారం చేసిన ఈయన పార్టీకి అవసరమైన వైద్య సేవలు చేసే వైద్య బృందానికి ఇన్చార్జిగా కూడా వ్యవహరించారు.

Telugu Abhishek Reddy, Ap, Viveka, Avinash Reddy, Ys Jagan-Telugu Political News

పులివెందుల జమ్మలడుగు స్థానాలలో పార్టీ వ్యూహాలలో కూడా పాలుపంచుకున్నట్లుగా చెబుతారు.ఆ సామర్థ్యం పై నమ్మకంతో ఆయన ను హుటాహుటిన ఇక్కడకు పిలిపించి పార్టీ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా తెలుస్తుంది .జగన్ మాటను కాదనలేక ఆయన కడపలో ల్యాండ్ అయ్యారట ….యువకుడు కావటం , వ్యూహాలను రచించే సామర్థ్యం కూడా ఉండటంతో ఆయన తొందర్లోనే కడప రాజకీయాల్లో భాగమవుతారని పార్టీ అభిమానుల మద్దతును గెలుచుకుంటారని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి.అయితే గడిచిన పది సంవత్సరాలుగా నియోజకవర్గంపై అధికారం చాలా ఇచ్చిన అవినాష్ రెడ్డి వర్గానికి మాత్రం ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లుగా వార్తలు వస్తున్నాయి ….

కష్ట సమయంలో అండగా ఉండాల్సింది పోయి ఇలా ప్రత్యామ్నాయనన్ని తీసుకొచ్చిన జగన్ వైఖరి పై వారు గుర్రుగా ఉన్నారట .అయితే వైసిపి పార్టీకి జగనే సుప్రీం కాబట్టి ఎలాంటి వ్యతిరేకత చూపించకుండా మౌనం గా ఉన్నట్లు సమాచారం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube