ప్రతి హామీని అమలు చేసిన ఏకైక నేత జగన్..: మంత్రి కొట్టు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కాపు నేస్తం బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు.

 Jagan Is The Only Leader Who Implemented Every Promise..: Minister Kottu-TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాటు పాలన చేసినా చెప్పుకునేందుకు ఒక్క మంచి పథకం లేదని మంత్రి కొట్టు అన్నారు.కానీ ఇచ్చిన ప్రతి హమీని అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ అని తెలిపారు.

చంద్రబాబులో ఏం నచ్చిందని ఓటేయాలని పవన్ చెప్తున్నారో అర్థం కావడం లేదన్నారు.చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులపై పవన్ ప్రశ్నించరా అని నిలదీశారు.

పవన్ కు డబ్బు సంపాదించడం తప్ప ఏమీ తెలియదని విమర్శించారు.తాడేపల్లిగూడెంలో త్వరలోనే మల్టీ చిల్డ్రన్ ఆస్పత్రికి సీఎం జగన్ భూమి పూజ చేస్తారన్న మంత్రి కొట్టు ఇండోర్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube