కేంద్రం నుంచి జ‌గ‌న్‌కు లీకులు.. అందుకే ధీమా

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు…వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ గ్యారెంటీ అన్న హామీతో ప్ర‌తిప‌క్షాల నుంచి ఎమ్మెల్యేల‌ను భారీగా పార్టీలో చేర్పించేసుకున్నారు.పునర్విభ‌జ‌నపై కేంద్రం కూడా సానుకూలంగా లేక‌పోయినా ప‌దేప‌దే చంద్రులిద్ద‌రూ ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు.

 Jagan Have Clarity About Delimitation Of Constituencies-TeluguStop.com

ముఖ్యంగా పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌ని ప‌క్షంలో ఏపీ టీడీపీలో అసంతృప్తి సెగ‌లు ర‌గ‌ల‌డం ఖాయం.టీడీపీలో ప‌రిస్థితి ఇలా ఉంటే.

ప్రతిప‌క్ష నేత జ‌గన్‌లో మాత్రం ఎటువంటి ఆందోళ‌న క‌నిపించ‌డం లేదు.నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై అనేదే ఉండ‌ద‌నే ధీమా ఆయ‌న‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

టీడీపీ అధినేతకు చెమ‌టలు ప‌ట్ట‌డానికి, జ‌గ‌న్ ధీమాగా ఉండ‌టానికి కార‌ణం.బీజేపీ.

ఈ విష‌య‌మై వైసీపీ నేత‌ల‌కు కేంద్రం నుంచి లీకులు అందుతున్నాయ‌ని తెలుస్తోంది.

ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయో ఉండ‌వోన‌నే టెన్ష‌న్ కంటే.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ఎప్పుడు జ‌రుగుతుందోన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు వేయిక‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.పున‌ర్విభ‌జ‌న ఉండ‌ద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినా.

గ‌ట్టిగానే కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు టీడీపీ ఎంపీలు! అయితే ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన జరగదన్న ధీమా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలో కనిపిస్తోందని విశ్లేష‌కులు చెబుతున్నారు.ఆ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ సహచరులతో ఢిల్లీ నుంచి తనకు వచ్చిన సమాచారాన్ని పంచుకుంటున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వైసీపీ నేత‌ల స‌మాచారం ప్ర‌కారం కొద్దిరోజుల నుంచి పాదయాత్రలో తనను కలిసేందుకు వస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నేతలతో జగన్.ఢిల్లీ నుంచి తనకు వచ్చిన సమాచారాన్ని వివరిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ పునర్విభజన ప్రక్రియను కేబినెట్ ఆమోదిస్తుందని చెబుతున్నారు.అనంత‌రం దానిని పార్లమెంటులో చర్చకు పెడతారని, అది అక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉందని స్ప‌ష్టంచేస్తున్నార‌ట‌.

అక్టోబర్, నవంబర్‌లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని కూడా వివరిస్తున్నారు.కేవలం చంద్రబాబు తృప్తి కోసమే బీజేపీ ఈ ప్రక్రియ చేపడుతుందని, ప్రధానంగా కాంగ్రెస్ దీనిని వ్యతిరేకించే అవకాశం ఉందని జగన్ చెబుతున్నారు.

కాబట్టి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయన్న భయం అవసరం లేదని, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిస్తున్నారు.అందులో భాగంగా ఆర్థికంగా స్థితిమంతులైన వారిని అభ్యర్థులుగా గుర్తించాలని సూచిస్తున్నట్లు సమాచారం.

గత ఏడాది నుంచి ఢిల్లీ వ్యవహారాలు చూస్తున్న ఓ ఎంపీ బీజేపీ సహా మిగిలిన పార్టీలతో సమన్వయ బాధ్యతలు నిర్వ‌హిస్తూ ఢిల్లీ పరిణామాలను జగన్‌కు ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్లు సమాచారం.ఈ క్ర‌మంలో వైసీపీ-బీజేపీ మ‌ధ్య స్నేహ‌బంధం చిగురిస్తోంద‌నేందుకు ఇవి స్ప‌ష్ట‌మైన సంకేతాలులా క‌నిపిస్తున్నాయి.

మ‌రి ఇవి మ‌రింత బ‌లోపేత‌మ‌వుతాయేమో వేచిచూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube