ఆ సినిమాలు హిట్టైతే జగన్ కు క్రెడిట్ ఇచ్చేవారా.. జగన్ ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానం ఉందా?

ఆచార్య, రాధేశ్యామ్, సర్కారు వారి పాట సినిమాలు ఫ్లాప్ కావడానికి సీఎం జగన్ కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.సీఎం జగన్ ను కలవని హీరోల సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని జగన్ ను కలిసిన హీరోల సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయని కామెంట్లు చేస్తున్నారు.

 Jagan Fans Questions Viral In Social Media Details Here , Jagan, Jagan Fans, Acharya , Chirenjeevi, Mahesh Babu , Sarkaru Vari Pata-TeluguStop.com

అయితే ఇదే సమయంలో సీఎం జగన్ అభిమానుల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు రివర్స్ లో వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి సర్కారు వారి పాట ఫ్లాప్ కాదని జగన్ పై కోపంతో ఈ తరహా ప్రచారం చేస్తున్నారే తప్ప సినిమా మరీ నాసిరకంగా అయితే లేదని సీన్లు కూడా బాగానే ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.

 Jagan Fans Questions Viral In Social Media Details Here , Jagan, Jagan Fans, Acharya , Chirenjeevi, Mahesh Babu , Sarkaru Vari Pata-ఆ సినిమాలు హిట్టైతే జగన్ కు క్రెడిట్ ఇచ్చేవారా.. జగన్ ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానం ఉందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సెకండాఫ్ మరింత మెరుగ్గా ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆచార్య, రాధేశ్యామ్, సర్కారు వారి పాట హిట్టైతే సీఎం జగన్ కు క్రెడిట్ ఇచ్చేవారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జగన్ సెంటిమెంట్ నిజమే అయితే రాజమౌళి సినిమా కూడా ఫ్లాప్ అయ్యేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.జగన్ పై ఉన్న కోపంతో హిట్ అవ్వాల్సిన సినిమాలను ఫ్లాప్ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చరణ్, ఎన్టీఆర్ జగన్ ను కలిసి ఉంటే ఆర్ఆర్ఆర్ రిజల్ట్ మారేదా? అని జగన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.గతంలో కూడా చాలామంది హీరోలు జగన్ ను కలిశారని ఈ సందర్భంగా జగన్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

Telugu Acharya, Chirenjeevi, Jagan, Jagan Fans, Mahesh Babu-Movie

కరోనా సమయంలో కొంతమంది టాలీవుడ్ హీరోలు ఫోన్ లో జగన్ తో మాట్లాడి టికెట్ రేట్లు పెంచుకున్నారని మరి జగన్ సెంటిమెంట్ నిజమైతే ఆ సినిమాలు కూడా ఫ్లాప్ కావాలి కదా అని చెబుతున్నారు.సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ రేట్ తక్కువని సినిమా ఫ్లాపైనా హిట్టైనా సెంటిమెంట్ పేరు చెప్పి ప్రముఖులను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube