ఇలా చేస్తే ఎలా జ‌గ‌నూ...? వైసీపీలో గ‌డ‌బిడ‌..!

రాజ‌కీయాలు మారుతున్నాయి.నేత‌లు కూడా మారుతున్నాయి.

 Jagan Doing Mistakes,problems In Ysrcp, Jagan,ysrcp,andhra Pradesh,tdp,other Lea-TeluguStop.com

అయితే ఎంత మార్పు వ‌చ్చినా.త‌న‌-మ‌న అనే తేడా అంటూ ఉంటుందిగా!  పార్టీ కోసం.

పార్టీ అదినేత‌ల కోసం త్యాగాలు చేసిన వారు.మా నాయ‌కుడిని అధికారంలో కూర్చోబెట్టుకునేందుకు ఏమైనా చేస్తాం.

అని పార్టీ కోసం స‌ర్వం ధార‌పోసిన వారిని మ‌రిచిపోతే.ఎలా? ఇది ఇప్ప‌టి స‌మ‌స్య కాదు.గ‌త టీడీపీ హ‌యాంలోనూ ఇలానే జ‌రిగింది.అయిన వారికి ఆకుల్లోనూ.పొరుగు పార్టీల నుంచి వ‌చ్చిన వారికి కంచాల్లోనూ ప‌ద‌వులు వ‌డ్డించిన ఘ‌న‌త చంద్ర‌బాబుకు ఉంది.అయితే, ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు దూర‌మ‌ని, త‌న‌ను, త‌న కుటుంబాన్ని న‌మ్ముకుని ఉన్న‌వారిని, త‌న కుటుంబాన్ని రాజ‌కీయంగా వెన్నుద‌న్నుగా నిలిచిన వారికి జ‌గ‌న్ ఇలా చేయ‌డ‌ని అనుకున్నారు వైసీపీ నాయ‌కులు.

“మా నాయ‌కుడు బాబు లాంటోడు కాదు!“ అని అనేక వేదిక‌ల‌పై చెప్పారు.ఇదే మాట‌ల‌ను జ‌గ‌న్ కూడా అసెంబ్లీలో వెల్ల‌డించారు.

మేం ఏ పార్టీ నుంచి నేత‌ల‌ను తీసుకునేది లేద‌న్నారు.అయితే, ఇంత‌లోనే ఆయ‌న మ‌ళ్లీ బాబు బాట‌ప‌ట్టారు.

టీడీపీ నుంచి నేత‌ల‌ను తీసుకుంటున్నారు.స‌రేతీసుకుంటే తీసుకోనీ.

అనుకున్నా.వైసీపీ కోసం అన్నీ త్యాగం చేసిన వారిని, త‌న కోసం పాద‌యాత్ర‌లు చేసిన వారిని, త‌న కుటుంబానికి వెన్నుద‌న్నుగా ఉన్న‌వారిని వ‌దిలేయ‌డం, పొరుగు పార్టీల నుంచి వ‌చ్చిన వారికి ప‌ద‌వులు ఇవ్వ‌డం, కాంట్రాక్టులు అప్ప‌గించ‌డం వంటివి ఇప్పుడు వైసీపీలో మంట‌లు రేపుతోంది.

ఇలా చేస్తే.ఎలా జ‌గ‌నూ.! అనే అసంతృప్తి స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

Telugu Andhra Pradesh, Assembly, Jagan, Praises, Ysrcp-Telugu Political News

తాజాగా ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరులో జ‌రిగిన ఘ‌ట‌న మ‌రింత‌గా పార్టీపై వ్య‌తిరేక‌త పెంచుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.ప్ర‌స్తుతం వైసీపీకి ప‌ట్టుకొమ్మ‌గా ఉన్న ప్ర‌కాశం జిల్లా సంత‌నూత‌ల‌పాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజ‌య‌కుమార్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి.ర‌వీంద్ర‌నాథ్ చౌద‌రి.

ఆయ‌న నుంచి దూర‌మై.వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వాస్త‌వానికి ఈయ‌న టీడీపీలో యాక్టివ్ పొలిటీషియ‌న్‌గా గుర్తింపు పొందారు.ఒంగోలులో ఉండే రవీంద్రనాథ్ … సంతనూతలపాడులో టీడీపీ వ్య‌వ‌హారాల‌ను అన్నీ తానై న‌డిపించారు.

ఈ ప‌రిణామాల‌ను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్‌.ఆయ‌న‌ను త‌న గూటికి చేర్చుకున్నారు.స‌రే! ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.కీల‌క‌మైన గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలంలో ఎల్ కోట-లింగంపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా చౌద‌రిని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

వాస్త‌వానికి ఈ ప‌ద‌వి కోసం వైసీపీలోనే ఎంతో మంది అర్హులైన నాయ‌కులు ఉన్నారు.వైఎస్ అన్నా, జ‌గ‌న్ అన్నా ప్రాణం పెట్టే నేత‌లు ఉన్నారు.

పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి నుంచి సేవ చేస్తున్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉన్నారు.వారిని కాద‌ని.

చౌద‌రికి అవ‌కాశం ఇచ్చారు.దీనిపైనే నేత‌లు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.ఇంత‌లోనే జ‌గ‌న్ ఆయ‌న‌కు మ‌రింత ప్రాధాన్యం పెంచారు.18 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులు అప్ప‌గించారు.ఇది మ‌రింత‌గా అసంతృప్తికి దారి తీసింది.

స‌రేలే.

మ‌న పార్టీలోనే ఉన్నారు కాబ‌ట్టి.మ‌న‌కు కూడా ఏదో చేస్తారులే అనుకుంటే.

ర‌వీంద్ర‌నాథ్ చౌద‌రి మాత్రం త‌న పాత పార్టీని, త‌న మాజీ నాయ‌కుడు విజ‌య్‌కుమార్‌ను మ‌రిచిపోలేక పోతున్నారు.ఇటీవ‌ల విజ‌య‌కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీడీపీ నాయ‌కులు ఆ పార్టీ అనుకూల ప‌త్రిక‌లో పెద్ద యాడ్ ఇచ్చారు.

దీనిలో విజ‌య్‌కుమార్‌ను కొనియాడారు.అయితే, గ‌తంలో ఆయ‌న‌కు పీఏగా ప‌నిచేసినా.

ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు కాబ‌ట్టి.ఈ పార్టీలో ప‌ద‌వి కూడా పొందారు కాబ‌ట్టి, కాంట్రాక్టులు కూడా సొంత చేసుకున్నారు కాబ‌ట్టి.

వైసీపీ ప‌లుకు ప‌ల‌కాల్సిన చౌద‌రి.విజ‌య్‌కుమార్‌కు అభినంద‌న‌లు తెలుపుతూ.

టీడీపీ నేత‌లు ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ర‌గిలిపోతున్నారు.

పార్టీ ఇచ్చిన ప‌ద‌విని అనుభ‌విస్తూ.పొరుగు పార్టీ నేత‌ల‌ను భుజాన మోస్తావా? అంటున్నారు.అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను కూడా విమ‌ర్శిస్తున్నార‌ని స‌మాచారం.పార్టీకి సేవ చేసిన వారిని వ‌దిలేసి.పొరిగింటి పుల్ల‌కూర‌ను తెచ్చుకున్న జ‌గ‌న్‌దే అస‌లైన త‌ప్ప‌ని.అప్పాయింట్‌మెంట్ ఇస్తే క‌డిగేస్తామ‌ని అంటున్నారు మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ఇలాంటి ప‌రిణామాలు దాదాపు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube