రెబల్ స్టార్ తో రెబల్ ఎంపి కి చెక్ పెట్టబోతున్నారా ?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.151 సీట్లతో ఘనవిజయం సాధించిన వైసీపీపై మొదటిసారి తిరుగుబాటు జెండా ఎగరేసిన రఘురామకృష్ణ రాజును( Raghu Rama Krishna Raju ) ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పార్లమెంటులో అడుగుపెట్టకుండా చూడాలని గట్టి పట్టుదలగా జగన్ ఉన్నారని చెబుతారు.

తమ పార్టీ పట్ల వ్యతిరేకత పెరగడంలో ఈ రెబల్ ఎంపి చేసిన విమర్శలు కూడా ఒక కారణమని జగన్ నమ్ముతున్నారని అందువల్ల ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనన గెలవకుండా అన్ని అస్త్రాలు వాడాలనే వ్యూహాన్ని వైసీపీ పాటిస్తుందని చెబుతున్నారు.

అందులో భాగంగానే నరసాపురం ఎంపీ సీటు నుంచి మరొకసారి రఘురామరాజు పోటీ చేస్తారని అంచనాలు ఉండగా ఆయన ను ఎదుర్కోవడానికి బలమైన సమీకరణాన్ని జగన్ రెడీ చేస్తున్నారని రెబెల్ స్టార్ కృష్ణంరాజు( Krishnam Raju ) సతీమణి శ్యామలాదేవిని నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయించాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

దాని కోసమే నయా రెబల్ స్టార్ ప్రభాస్ కి అనుకూలంగా వై సి పి ప్రభుత్వం వ్యవహరిస్తుందని కృష్ణంరాజు దశదినకర్మల సమయం లో కానీ కానీ ఆది పురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విషయం లో గాని సినిమా టిక్కెట్ల ధరల పెంపు విషయంలో కానీ ప్రభాస్ వర్గాన్ని సంతృప్తిపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని, వైసీపీ మంత్రులు దగ్గరుండి ఈ పనులు అన్నీ చక్కబెట్టారని ,భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసమే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ దిశగా ఇప్పటికే శ్యామల దేవికి ( Shyamala Devi )వర్తమానం పంపించారని ఆమె కనుక ఓకే అంటే ప్రచారానికి ప్రభాస్ కూడా రంగంలోకి దిగితే సమీకరణాలు వేగంగా మారుతాయని అంచనాలతో అధికార పార్టీ ఉందని తెలుస్తుంది.బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.అశేషమైన తన అభిమానులు మద్దతు ఇస్తే మాత్రం శ్యామలాదేవి గారి విజయం నల్లేరుపై నడకే అవుతుంది.

Advertisement

ఇప్పటివరకు జనసేన తెలుగుదేశం పొత్తుతో తన విజయం ఖాయమని భావిస్తున్న రఘురామకృష్ణం రాజుకి ఇది చేదు వార్తే అని చెప్పాలి .మరి రెబల్ స్టార్ రాజకీయాన్ని రెబల్ ఎంపీ తట్టుకోగలరో లేదో చూడాలి.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు