ఫైమా బిగ్ బాస్ ఎంట్రీ పై స్పందించిన జబర్దస్త్ కమెడియన్స్.. ఏమన్నారంటే?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో అందరికీ తెలిసిన విషయమే.

గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు.

గతంలో కేవలం మగవారికి మాత్రమే పరిమితమైన ఈ షోలో ఇప్పుడు మహిళలు కూడా సందడి చేస్తున్నారు.వర్ష , ఫైమా, రోహిణి వంటి వారు జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందారు.

ఇలా లేడీ కమెడియన్లుగా ఫేమస్ అయిన ఫైమా మొదట ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్ షోలో సందడి చేసింది.ఆమె పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవటంతో జబర్దస్త్ లో అవకాశం కల్పించారు.

జబర్దస్త్ ద్వారా ఫైమ మరింత పాపులర్ అయింది.ఈ క్రమంలో ఇటీవల ఆమె బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే చాలామంది కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి.జబర్దస్త్ నుండి చలాకి చంటి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళనున్నట్లు కన్ఫామ్ అయ్యింది.

అలాగే ఇప్పుడు ఫైమా పేరు కూడా వినిపిస్తోంది.ఇటీవల ఈ విషయం గురించి కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు స్పందించారు.

ప్రస్తుతం ఫైమా బుల్లెట్ భాస్కర్ టీం లో లీడ్ రోల్ చేస్తోంది.అందువల్ల బుల్లెట్ భాస్కర్ కి సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటోంది.అందువల్ల ఆమె బిగ్ బాస్ కి వెళ్ళే అవకాశం లేదని కొందరు జబర్థస్త్ ఆర్టిస్ట్ లు వెల్లడించారు.

జబర్థస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో వరుసగా కనిపిస్తోంది.అందువల్ల ఈ షో ల ద్వారా ఫైమా బాగా సంపాదిస్తోంది.ఇలాంటి సమయంలో ఫైమా బిగ్ బాస్ షో కి వెళ్లి ఎందుకు ఇబ్బంది పడుతుందని కొందరు వెల్లడించారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అయితే ఈ విషయం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే సెప్టెంబర్ 4 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు