శ్రీముఖి పరువు తీసిన జబర్దస్త్ అవినాష్.. లడ్డు ఇంకో లడ్డు అడిగిందంటూ?

బిగ్ బాస్ షో తర్వాత స్టార్ మా ఛానెల్ లోని ప్రోగ్రామ్స్ కే పరిమితమైన అవినాష్ ఆ షోలో ప్రసారమయ్యే కామెడీ షోలతో పాటు ఈవెంట్లలో పాల్గొంటూ తన కామెడీ టైమింగ్ తో, పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

బిగ్ బాస్ షో తర్వాత హోస్ట్ గా తక్కువ సంఖ్యలో షోలు చేస్తున్న శ్రీముఖి పలు ఈవెంట్లలో మాత్రం పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

స్టార్ మా ఛానల్ లో ఈ ఆదివారం సాయంత్రం స్టార్ మా పరివార్ ఛాంపియన్ షిప్ పేరుతో ఒక ఈవెంట్ ప్రసారం కానుంది.ఈ ఈవెంట్ లో అవినాష్ పంతులు గెటప్ లో దర్శనమిచ్చారు.

పడవలో బెడ్డు, బెడ్ లో పక్కన అగర్ బత్తీలు అని చెప్పగా నేనే సెట్ చేశానని అవినాష్ చెబుతాడు.గురూజీ స్వీట్స్ మా షాపువే అని సీరియల్ నటుడు చెప్పగా శ్రీముఖి ఒక లడ్డు ఇస్తారా అని అడగగా ఒక లడ్డు ఇంకో లడ్డును అడుగుతుందని అవినాష్ కామెంట్లు చేస్తారు.

ఆ తర్వాత అవినాష్ శ్రీముఖి లావుగా ఉందని ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ సరదాగా నవ్విస్తాడు.ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.

Advertisement
Jabardasth Avinash Shocking Comments About Srimukhi, Crazy Uncles Movie, Jabarda

ప్రోమోల్లో అవినాష్ హవా కనిపిస్తుండటం గమనార్హం.వరుసగా ఈవెంట్లతో బిజీ అవుతున్న శ్రీముఖి కొత్త షోలకు ఎప్పటినుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాల్సి ఉంది.

శ్రీముఖి అభిమానులు మాత్రం ఈవెంట్లతో పాటు శ్రీముఖి షోలతో బిజీ అయితే బాగుంటుందని భావిస్తున్నారు.శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా సైతం రిలీజ్ కావాల్సి ఉంది.

Jabardasth Avinash Shocking Comments About Srimukhi, Crazy Uncles Movie, Jabarda

శ్రీముఖి నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా ఆ సినిమాలు శ్రీముఖి కెరీర్ కు మాత్రం ఆశించిన స్థాయిలో ప్లస్ కాలేదు.క్రేజీ అంకుల్స్ సినిమాలో శ్రీముఖిదే కీలక పాత్ర కావడంతో ఆమె ఎటువంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు