హద్దులు దాటుతున్న డైలాగులు.. జబర్దస్త్ కొనసాగడం ఇక కష్టమేనా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గురు శుక్ర వారాల్లో ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న షో జబర్దస్త్.

 Jabardast Crossing Its Limits Jabardasth, Crossing Limits, Comedians, Roja, Sud-TeluguStop.com

అయితే జబర్దస్త్ లో రానురాను పరిస్థితులూ చాలా అధ్వానంగా తయారవుతున్నాయి.జబర్దస్త్ షో కాస్త పచ్చి బూతు షోగా మారుతోంది.

ప్రతి ఒక్క స్కిట్ లో డబుల్ మీనింగ్ డైలాగులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.అంతేకాకుండా ఈ షోని ఏ గ్రేడ్ కుటుంబమంతా కలిసి చూసే రోజులు ఎప్పుడో పోయాయి.

రాను రాను ఈ షో కుటుంబంతో కలిసి చూడాలి అంటేనే ప్రేక్షకులు ఏదో విధంగా అనుకుంటున్నారు.

మొదట కామెడీ షో అంటూ ప్రసారమైన ఈ కార్యక్రమం డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ షేవింగ్ సెటైర్లతో ఒక బూతు షోగా మారుతోంది.

అయితే జబర్దస్త్ షో కార్యక్రమం మొదలైనప్పటి నుంచి మగవాళ్ళు లేడీ గెటప్ వేసేవారు.అలా గెటప్స్ వేస్తూ వేస్తూ జబర్దస్త్ షో లో పలువురు ట్రాన్స్ జెండర్ గా కూడా మారిపోయారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో లోకి కొత్త కొత్త అమ్మాయిలను తీసుకువస్తున్నారు.టీమ్ లీడర్ లు ఒకరితో మరొకరు పోటీ పడి మరీ కొత్త కొత్త అప్ కమింగ్ ఆర్టిస్టులను జబర్దస్త్ షో కి తీసుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే అమ్మాయిల విషయంలో పోటీపడి మరీ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు.

Telugu Chandra, Comedians, Limits, Hyper Adi, Jabardasth, Roja, Sudhir, Venu-Mov

ఇకపోతే హీరోయిన్ రోజా విషయానికొస్తే హీరోయిన్ రోజా పేరు కాస్త జబర్దస్త్ జడ్జి రోజా అని ముద్ర పడిపోయింది.జబర్దస్త్ షో కి వచ్చిన తర్వాత రోజా పాపులారిటీ మరింత పెరిగింది.ఒకవేళ అవకాశం వచ్చి ఆమె మంత్రి అయితే తప్పకుండా ఈ షోకి గుడ్ బాయ్ చెబుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

షోలో డబుల్ మీనింగ్ డైలాగ్ లు వేస్తున్న కూడా పట్టించుకోకుండా ఆ డైలాగులకు కడుపుబ్బ నవ్వుతోంది.ఇకపోతే కొంతమంది ఆర్టిస్టులు జబర్దస్త్ షోలో వారి టాలెంట్ ను నిరూపించుకుంటే తప్పకుండా సినిమా అవకాశాలు వస్తాయి అన్న భ్రమలో చాలామంది ఈ ప్లాట్ ఫామ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

Telugu Chandra, Comedians, Limits, Hyper Adi, Jabardasth, Roja, Sudhir, Venu-Mov

గతంలో సుధీర్, హైపర్ ఆది, చంద్ర, వేణు ఇలాంటి కమెడియన్లు సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ ని వీక్షించే ప్రేక్షకుల సంఖ్య చాలా వరకు తగ్గింది అని చెప్పవచ్చు.అదేవిధంగా జబర్దస్త్ ని బాగా ఫాలో అయ్యేవారు ఈ ఓవరాక్షన్ ఎక్కువ కాలం సాగకపోవచ్చు అన్న నిర్ణయానికి వచ్చారట.షో లో బూతులు మరీ ఎక్కువ అయితే సోషల్ మీడియాలో ఈటీవీ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

కాబట్టి జబర్దస్త్ షో లో ఇలాగే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు కంటిన్యూ అయితే ఇక ముందు ముందు జబర్దస్త్ షో కొనసాగడం కష్టమే అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube