తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి కూతురు సుప్రీత గురించి అందరికి తెలిసిందే.సుప్రీత తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.
ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.
ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.
చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.
అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.
అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.
అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.
ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.ఇక సుప్రీత కూడా వెండితెరపై అడుగుపెట్టింది.‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.ఇక సుప్రీత నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా హల్ చల్ చేస్తోంది.
నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది.ప్రతిరోజు ఏదో ఒక ఫోటో పెట్టి బాగా హల్ చల్ చేస్తుంది.పట్టుమని పాతికేళ్లు కూడా దాటలేదు కానీ ఆమె అందాలు మాత్రం పాతికేళ్లు నిండిన దానిలా ఉంటాయి.ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టడానికి ఈ అమ్మడు అందాలు బాగా పెంచేసింది.

ఇక ఈమె ఫోటోలు చూసి కుర్రాళ్ళు మాత్రం కన్నార్పకుండా చూస్తారని చెప్పవచ్చు.ఇక తన తల్లి సురేఖ వాణిని కూడా అచ్చం తన లాగా తయారుచేసి తనకు కూడా గ్లామర్ షోను పరిచయం చేసింది.ఇక ఇద్దరు కలిసి బాగా హడావుడి చేస్తూ ఉంటారు.ఇద్దరు తల్లి కూతుర్లు ట్రిప్స్ అంటూ పబ్ లంటూ బాగా తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.

అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా సుప్రీత తన ఇన్స్టా వేదికగా ఒక వీడియో పంచుకుంది.అందులో తను తన పెట్ తో ఆడుకుంటూ కనిపించింది.ఇక ఆ కుక్క పిల్ల లేకుంటే తన లైఫ్ ఊహించుకోవడం కష్టం అంటూ షేర్ చేసుకుంది.నిజానికి సుప్రీత పెంపుడు కుక్కను చాలా ప్రేమగా చూసుకుంటుంది.అప్పుడప్పుడు దానితో గడిపిన వీడియోలు కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.








