నిరుపేదలకు అన్ని విధాలా ఆదుకోవడం ప్రభుత్వ ధర్మం. అందుకు ఎన్ని కోట్లు ఖర్చు అయినా వెనుకాడేదే లేదు: డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

విశాఖ కె.కోటపాడు గ్రామంలో ప్రతి మరు మూలా ఉన్న ప్రజానీకం అవసరాలు తెలుసుకుని, ప్రభుత్వ పరంగా వారికీ కావలసిన సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా చూడమని సీఎం జగన్ పంపించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

 It Is The Duty Of The Government To Support The Poor In Every Way. No Matter How-TeluguStop.com

కోటపాడు (మం), ఆర్.వై అగ్రహారం పంచాయతీ లోని శివారు గ్రామాలు పోతన వలస, ఉగ్గిన వలస గ్రామాలలో పర్యటించిన మంత్రి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలను వింటూ సత్వరమే వాటిని పరిష్కరించారు, అంగన్వాడీ కేంద్రంలో బాలలతో ముచ్చటించి, వారికి అందిస్తూ పోషక ఆహారం, వారి పర్యవేక్షణను పరిశీలించారు, అనంతరం నూతన అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు స్వయంగా దర్శించారు.అవ్వ తాత లను ఆప్యాయం పలకరిస్తూ వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు, పలువురు దివ్యాంగులను కలిసి వారికి నేనున్నానని భరోసా కల్పించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మండుటెండలో కూడా ప్రజాదరణ తగ్గకపోవడంతో ముత్యాల నాయుడు నూతన ఉత్సాహంతో తీవ్ర ఎండను కూడా లెక్కచేయకుండా ప్రజల మధ్య గడిపారు.ఈ కార్యక్రమంలో కోటపాడు జెడ్పీటీసీ అనురాధ, ఎంపిపి రెడ్డి జగన్ మోహన్, ఎమ్మార్వో, ఎంపిడిఒ, మండల, గ్రామ స్థాయి అధికారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube