ఆ హోటల్ లో ఫ్రీ వైఫై వాడాలంటే అంత సులువు కాదు సుమా.. ఎందుకంటే..?!

రెస్టారెంట్ లోకి కస్టమర్లను ఆకట్టుకోవాలంటే చాలా స్పెషల్ ఫుడ్స్ చేయాలి.లేదా మా రెస్టారెంట్ లో టేస్ట్ బాగుంటుందని పబ్లిసిటీ చేయాలి.

 It Is Not Easy To Use Free Wifi In That Hotel Suma .. Because .. Viral News, Tre-TeluguStop.com

ఉచితం అనే చెప్పాలే కానీ.కస్టమర్లు లైన్ లో నిల్చుంటారు.

ఇవేవి కాకుండా ఒక రెస్టారెంట్ కొత్తగా ఆలోచించింది.మా రెస్టారెంట్ కు వస్తే వైఫై ఫ్రీ అని ఆఫర్ పెట్టింది.

ఈరోజుల్లో తినేటప్పుడు కూడా ఫోన్ తప్పనిసరి అయిపోయింది.దీంతో తినేటప్పుడు కూడా నెట్ అవసరం అయిపోయింది.

అయితే రెస్టారెంట్ లో ఫ్రీ వైఫై అంటే రెస్టారెంట్ యాజమాన్యం నష్టపోక తప్పదు.ఎందుకంటే ఒకసారి వచ్చిన వ్యక్తి పాస్ వర్డ్ తెలుసుకొని ఇంకోసారి లోపలి రాకుండా బయటే ఉండి ఇంటర్నెట్ యూజ్ చేసుకొని వెళ్ళిపోతాడు.

దీంతో రెస్టారెంట్ యాజమాన్యం నష్టపోతోంది.అందుకే ఒక రెస్టారెంట్ కొత్తగా ఆలోచన చేసింది.

పాస్వర్డ్ తెలుసుకోవడం ఇంత కష్టమా అనిపించేలా ఉంది.ఇది చూసిన వారందరు షాక్ కి గురవుతున్నారు.

విషయం ఏంటంటే.థాయ్‌ రెస్టారెంట్ యాజమాన్యం తమ వైఫై పాస్వర్డ్‌ అనూహ్య రీతిలో సెటప్ చేసుకుంది.ఒక గణిత సూత్రాన్ని పరిష్కరిస్తే వచ్చేదే వైఫై పాస్‌వర్డ్‌ అంటూ ఒక బోర్డు ఏర్పాటు చేసింది.ఇటీవలే ఒక కస్టమర్ ఒక రెస్టారెంట్ కి వెళ్ళాడు.

అయితే ఫ్రీ ఇంటర్నెట్‌ యూజ్ చేసేందుకు పాస్‌వర్డ్‌ తెలుసుకునేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలోనే అతడు పాస్వర్డ్ కోసం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆన్సర్ కనిపెట్టాలని తెలుసుకుని షాక్ అయ్యాడు.

అంతేకాకుండా దీనికి సమాధానం ఎవరైనా చెప్పగలరు అని రెడిట్ లో ఓ ఫొటో షేర్ చేశాడు.అయితే ఇప్పుడు అతను చేసిన ఆ పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.

Telugu Odd, Offbeat, Sanantonio, Weirdwifi, Yayasthai-Latest News - Telugu

నిజానికి ఇప్పుడు కాదు ఈ ఆలోచనని 2016 లోనే చేసింది.అయితే ఇప్పుడు ఆ కస్టమర్ రెడిట్ లో షేర్ చేయడంతో మళ్ళీ చర్చ మొదలైంది.ఈ పాస్వర్డ్‌ చిత్రాన్ని ‘ఆడ్ స్టఫ్ మ్యాగజైన్సో షల్ మీడియాలో పోస్ట్ చేసింది.అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పాస్వర్డ్ తెలుసుకోడానికి చాలా ప్రయత్నిస్తారు.అయితే ఈ రెస్టారెంట్ యాజమాన్యం చేసిన ఆలోచనకి అందరు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube