పీరియడ్స్ లో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే వీటిని తింటే మేలు..

చాలా మంది యువతుల్లో, మహిళల్లో కొందరికి ఐదు రోజుల పాటు రక్తస్రావం అవుతూ ఎక్కువ రక్తం బయటకు పోతూ ఉంటుంది.

ఇలా అవుతుందంటే వీళ్ళు ఐరన్ ను ఎక్కువగా కోల్పోతున్నారని అర్థం చేసుకోవచ్చు.

అందుకోసం సరైన రీతిలో ఆహారం తీసుకోకపోతే వీళ్ళలో తీవ్రమైన రక్తహీనత ఏర్పడే అవకాశం ఉంటుంది.రక్తం పెరగడం కోసం ఇలాంటి వారు తీసుకోవాల్సిన ఆహారాలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఐరన్ ఎక్కువగా ఉండి కూడా సులభంగా జీర్ణమయ్యే పౌష్టికాహారాన్ని ఇటువంటి ఆడవారు తీసుకోవడం మంచిది.ఈ ఆహారంలో ముదురు ఆకుపచ్చ ఉండే పాలకూర, బచ్చలి కూర, గోంగూర, తోటకూర వంటి ఆకుకూరలు తినడం మంచిది.పచ్చి బఠానీలు, చిక్కుళ్ళు వంటి పప్పు దినుసులు తినడం కూడా ఎంతో మంచిది.

క్యారెట్, బీట్రూట్ వంటి దుంపలు రక్తం పెరగడానికి ఎంతో ఉపయోగపడతాయి.మాంసాహారం తినాలనుకునేవారు కాలేయం, గుడ్లు ఎక్కువగా తీసుకుంటే అందులోని హిమోగ్లోబిన్ వల్ల శరీరంలో రక్తం త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

Advertisement

ఇంకా చెప్పాలంటే ఎండు ఖర్జూరం, బాదం వంటి డ్రైఫ్రూట్స్ కూడా తినడం ఎంతో మంచిది.బెల్లం పల్లి పట్టి, తేనె వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

అయితే వీటిని పరిమితంగా తినడం మంచిది.డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే ఇలాంటి వాటిని తినడం మంచిది.

ఇంకా చెప్పాలంటే రక్తహీనత ఎక్కువగా ఉన్నవారు తరచూ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్త పరీక్షను చేయించుకుంటూ ఉండటం వల్ల శరీరంలో రక్తం, రక్తహీనత గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.అది ఏ కారణం వల్ల వచ్చిందో దానికి అవసరమైన చికిత్స ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు.అలాంటి అవసరం ఉన్నవారు ఐరన్ టాబ్లెట్లను, సమస్య మరీ ఎక్కువ అవసరమున్నవారు రక్తం ఎక్కించుకోవడం వంటి చికిత్సలు తీసుకోవడం మంచిది.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!
Advertisement

తాజా వార్తలు