కలెక్క్షన్ కింగ్ మోహన్ బాబు యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన పనిలేదు డైలాగ్స్ చెప్పడం లో ఆయనకి ఆయనే సాటి.అలాంటి మోహన్ బాబు మొదట ఇండస్ట్రీ కి విలన్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కామెడీ విలన్ గా చేసి, ఆ తర్వాత హీరోగా మారారు మొదట్లో హీరో గా మంచి సక్సెస్ లు అందుకున్న మోహన్ బాబు తరువాత వరుస ప్లాప్ లు రావడంతో కొంచం డీలా పడ్డారు అయితే మోహన్ బాబు సినిమా అంటే అందరు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని షూటింగ్ లో పాల్గొనాలి మోహన్ బాబు ముందు క్రమశిక్షణ గా ఉండాలి ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే
మోహన్ బాబు ఊరుకోడు అలాంటి రూల్స్ ఉంటాయి కాబట్టే అపట్లో డైరెక్టర్ లు మోహన్ బాబు తో సినిమా చేయాలంటే ఆలోచించేవారు…ఇక ఇది ఇలా ఉంటె అప్పట్లో మోహన్ బాబు చాలా సినిమాలకి కోటి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేవాడు.కోటి మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటుంటే అతని రికార్డింగ్ థియేటర్ కి వచ్చి మోహన్ బాబు అది బాలేదు ఇది బాలేదు ఈ ట్యూన్ ఇటు మార్చు అని చెప్పేవారట

దాంతో కోటి కి చాలా కోపం వచ్చెదట అయినా కూడా సైలెంట్ గా ఉండేవాడట అయితే ఒక రోజు కోటి మోహన్ బాబు చేసే అతి తట్టుకోలేక నీకు ఇక్కడ ఏం పని నా రికార్డింగ్ స్టూడియో నుంచి వెళ్ళిపో అని అరిచారట దాంతో మోహన్ బాబు సైలెంట్ గా వెళ్లిపోయారట ఇద్దరు కొద్దిసేపు ఒకరి ముఖాలు ఒకరు శత్రువుల్లా చూసుకొని మాట్లాడుకునేవారు కాదట ఇద్దరు కొద్దిసేపు అటు ఇటు తిరిగి

సాయంత్రానికి మళ్లి ఇద్దరు కలిసిపోయి మాట్లాడుకునేవారట.కోటి కి మోహన్ బాబు కి ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉండేదట…కోటి మ్యూజిక్ ఇచ్చిన మోహన్ బాబు సినిమాల్లో పెదరాయుడు సినిమా మ్యూజిక్ హైలెట్ అని చెప్పాలి ఈ సినిమాతో మోహన్ బాబు ఒక పెద్ద హిట్ కొట్టారని చెప్పవచ్చు…అలా కోటి కి మోహన్ బాబు కి మధ్య చాలా గొడవలు జరిగినప్పటికీ మళ్లి వెంటనే మాట్లాడుకునేవారట…
.