భూమి అలా ఉండడానికి గల కారణాలను వివరిస్తున్న ఇస్రో ఫొటోలు!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో తాజాగా భూమికి సంబంధించి 5 ఫొటోలను రిలీజ్ చేయగా అవి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.ఇక్కడ ఫోటోని మీరు గమనించినట్లయితే ఆ ఫొటోల్లో భూమి( Earth ) ఎరుపు రంగులో కనిపించడం మనం గుర్తించవచ్చు.

 Isro Photos Explaining The Reasons Why The Earth Is Like That Isro Photos, Lates-TeluguStop.com

ఈ క్రమంలోనే బ్లూ కలర్ బదులు ఎరుపు రంగులో ఎందుకు కనబడుతోందని అంతా ఆశ్చర్యపోతున్నారు.అంతరిక్షంలోని శాటిలైట్స్ నుంచి చూస్తే భూమి ఇలాజె కనిపిస్తుందని ఇస్రో తెలిపింది.

నిజానికి ఇవి నిజమైన భూమి కలర్స్ కావట.

మరి ఈ రంగులో ఎందుకు అనే అనుమానం కలుగుతుంది కదూ.EOS-06 శాటిలైట్ నుంచి భూమి ఈ రంగుల్లో కనిపించింది.ఈ శాటిలైట్‌కి ఓషన్ కలర్ మానిటర్ ఉంటుంది.

దాని ద్వారానే భూమి ఇలా కనిపించిందని తెలుస్తోంది.ఆ శాటిలైట్ ఇచ్చే డేటాను తీసుకొని.నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వారు ఇస్రోతో కలిసి… 2939 ఫొటోలను కలిపి ఈ 5 ఫొటోలను రూపొందించడం జరిగింది.2939 ఫొటోలు.ఒక్కొక్కటీ.1 కిలోమీటర్ ప్రదేశానికి రిజల్యూషన్ కలిగివున్నాయి.ఇలా మొత్తం 300 GB డేటాను ప్రాసెస్ చేశారు.దాంతో భూమి సరికొత్తగా కనిపించింది.

ఈ ఫొటోలు 2023 ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య తీసినట్లు ఇస్రో( ISRO ) తాజాగా పేర్కొంది.ఇస్రోకి చెందిన ఓషన్ కలర్ మానిటర్ మన భూమిని 13 రకాల వేవ్‌లెంగ్త్స్‌లో పరిశీలించి భూమి, నీరు, సముద్రాల డేటాను అత్యంత వివరింగా చెబుతుంది.OCM గురించి మీకు తెలిసే ఉంటుంది.అది సముద్రాల లోపల ఎక్కడో ఉన్న అడవుల్ని కూడా గుర్తించగలదు.ఈ ఫొటోలను హ్యాండిల్‌లో ఇస్రో షేర్ చేసింది.దాంతో ఇవి సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతుండగా నెటిజన్లు వాటిపైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.“ఈ ఫొటోలు మైండ్ బ్లోయింగ్” అని కొందరు కామెంట్ చేస్తుంటే, “ఎక్సలెంట్.భారతీయుణ్ని అయినందుకు గర్వపడుతున్నాను” అని మరో యూజర్ కామెంట్ రాసుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube