God worship : పగిలిపోయిన దేవుని పటాలకు పూజలు చేస్తే ఇంటికి మంచిది కాదా..

దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన దేశ ప్రజల ఇళ్లలో చాలామంది పూజ గదిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.

ఆ పూజ గదిలో ఎక్కువగా దేవుని పటాలను, కొన్ని దేవుని విగ్రహాలను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు.

కానీ ఇలా పూజ గదిలో ఎక్కువ దేవుని ఫోటోలను ఉంచకూడదు.అయితే దేవుని పూజ చేయాలి అనుకున్నవారు రోజుల్లో కనీసం 40 నిమిషాలు పూజ చేస్తే సరిపోతుందట.

ఎప్పుడైనా సరే పూజ చేసిన తర్వాతే పనులన్నీ చేసుకోవడం మంచిదని వేద పండితులు చెబుతున్నారు.భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా పని చేసుకుంటేనే మంచిదని అది పూజ చేసిన తర్వాత చేస్తే ఇంకా మంచిదని వేద పండితులు చెబుతున్నారు.

అప్పుడే పని మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్మకం.దానివల్ల ఆ భగవంతుని చల్లని చూపు తమపై ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

Advertisement

అలాగే పూజ గదిలో కొన్ని రకాల దేవుడి పటాలను అస్సలు ఉంచకూడదు.కొంతమంది ఇంట్ల లలో భగవంతుని పటాలు వంగిపోవడం, బూజు పట్టడం, లేదంటే అద్దాలు పగిలి పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

అటువంటి దేవుడి పటాలను ఎప్పుడూ ఇంట్లోని పూజ గదిలో ఉంచి పూజ అసలు చేయకూడదు.

ఒకవేళ పూజను అలాగే విరిగిపోయిన పటాలతో పూజ చేయడం వల్ల పూజ చేసిన వారికి ఫలితం దక్కదు.అంతేకాకుండా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.ఇంట్లో పగిలిన దేవుని ఫోటోలు ఉంటే ఆ ఫోటోలను వెంటనే ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయడం మంచిది.

పగిలిన దేవుడి ఫోటోలను ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం వల్ల కీడు జరిగే అవకాశం ఉంది.అలాగే చాలామంది ఇంట్లో విరిగిపోయిన విగ్రహాలను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై18, గురువారం 2024

అలా చేయడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు