ఇదేందయ్యా ఇది.. పట్టుకోకుండానే వస్తువులను కదిలిస్తున్న యూఎస్ కపుల్..?

సోషల్ మీడియాలో చాలామంది తమకు అతీతమైన, అద్భుతమైన శక్తులు ఉన్నాయని క్లెయిమ్ చేస్తుంటారు.

తాజాగా ఒక యూఎస్ కపుల్ వీరందరి కంటే ఒక అడుగు ముందుకేసి అందరికీ అద్భుతమైన శక్తులు నేర్పిస్తామని చెబుతున్నారు.

అమెరికన్ దంపతులు( American couple ) తాము వస్తువులను తాకకుండా కదిలించే శక్తిని సాధించామని చెబుతున్నారు.ఇలా వస్తువులను మనస్సుతో కదిలించడాన్ని టెలికైనసిస్ అంటారు.

ఈ దంపతులు వాతావరణాన్ని కూడా నియంత్రించగలమని, భవిష్యత్తును ముందే చెప్పగలమని, గాలిని తమ ఇష్టం వచ్చినట్లు మార్చగలమని అంటున్నారు.

ఈ దంపతులు తమ గుర్తింపును రహస్యంగా ఉంచుకుంటూ, తమకు తెలిసిన ఈ అద్భుత శక్తులను ఇతరులకు నేర్పించడానికి ఆన్‌లైన్‌లో కోర్సులు నిర్వహిస్తున్నారు.ఈ కోర్సుల స్టార్టింగ్ ప్రైస్ $22.22 (దాదాపు రూ.1,800).వీరు ప్రభుత్వం ఈ అద్భుత శక్తులను దాచిపెడుతుందని, ప్రజలు తమ నిజమైన శక్తిని తెలుసుకోకుండా చేయాలనుకుంటుందని వారు ఆరోపించారు.

Advertisement

ఈ దంపతులు అందించే కోర్సులలో మ్యాజికల్ మెడిటేషన్, సైకిక్ ఎబిలిటీస్ ( Magical Meditation, Psychic Abilities )వంటివి ఉన్నాయి.వీరి అత్యంత ఖరీదైన కోర్సు గాలిని నియంత్రించే శాస్త్రం.ఈ కోర్సుకు నెలకు $111.11 (సుమారు రూ.9,000) డబ్బు చెల్లించాలి.ఆ దంపతులు తమకు అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పినా, చాలా మంది దీన్ని నమ్మడం లేదు.

వీరు తమ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.ఆ వీడియోల్లో వారు తమ చేతులు తాకకుండానే అల్యూమినియం ఫాయిల్‌ను కదిలిస్తున్నట్లు చూపిస్తున్నారు.

కానీ, ఈ ఫాయిల్ వారి చేతుల వల్ల వచ్చిన గాలికి కదులుతుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరొక వీడియోలో, ఆ దంపతులలో ఒకరు గాలిని తమ ఇష్టం వచ్చినట్లు మార్చగలరని చూపిస్తున్నారు.కానీ, వీడియోలో ఆ వ్యక్తి ఒక చెట్టు ముందు నిలబడి గాలి వీచే దిశలోనే చేతులు ఆడుతున్నట్లు కనిపిస్తోంది.అంటే, ఆ వ్యక్తి గాలిని నియంత్రిస్తున్నట్లు కాకుండా, గాలి వీచే దిశలోనే చేతులు ఆడిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?

ఆ దంపతులు చేసే వైరల్ స్టంట్స్‌ ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ లాంటి యాప్‌ల నుంచి ఎక్స్ (ట్విట్టర్) వరకు వ్యాపించాయి.వారి రీసెంట్ వీడియోను 4 కోట్ల మందికి పైగా చూశారు.

Advertisement

ఆ దంపతులు చేసే వీడియోలను చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.మరికొందరు వారిని విమర్శిస్తున్నారు.

ఈ దంపతులు చేస్తున్నవి అద్భుతాలు కాదని, సాధారణ కదలికలేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు.చాలా సీరియస్ గా తమకు అద్భుత శక్తులు ఉన్నాయని వీరు అబద్దాలు చెప్పడం భలే ఫన్నీగా ఉందని కొంతమంది కామెంట్లు చేశారు.

స్కూల్లో చిన్న పిల్లోడు తన సీక్రెట్ ప్రదర్శిస్తున్నట్లుగా ఫన్నీగా ఉంది అని మరి కొంతమంది అన్నారు.వీరికి ఈ మధ్య భ్రమించి ఉంటుంది అని ఇంకొంతమంది ఘాటుగా వ్యాఖ్యానించారు.

అమాయకులు ఈ కోర్స్ తీసుకొని మోసపోతారేమో అని ఇంకొందరు అన్నారు.వీరికి ఎలాంటి అద్భుత శక్తులు లేవు అని, అల్యూమినియం ఫాయిల్ ఎలక్ట్రిసిటీ కారణంగా ఇది కదులుతూ ఉంటుందని పేర్కొన్నారు.

తాజా వార్తలు