పుష్ప 2 క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇదేనా..? అసలు విలన్ ఎవరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 )సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ని రీసెంట్ గా షూట్ చేసినట్టుగా తెలుస్తుంది.క్లైమాక్స్ లో ఈ సినిమాలో ఒక భారీ ట్విస్ట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

సినిమా మొత్తానికి ఆ ట్విస్ట్ హైలెట్ గా నిలబపోతుందని సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే అందుతున్నాయి.

మరి మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) మరొకసారి నేషనల్ అవార్డు మీద కన్నేసినట్టుగా తెలుస్తుంది.పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు ని అందుకున్న మొదటి తెలుగు హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో కూడా నేషనల్ అవార్డుని అందుకుంటే తనను మించిన నటుడు మరొకరు ఉండరు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తాడు.

Advertisement

ఇక ఇప్పుడు పుష్ప 2 క్లైమాక్స్ లో ఫహద్ ఫాజిల్ ( Fahadh Faasil ) పుష్ప ఇద్దరూ కలిసిపోయి మంగళం శీను అలాగే ఇంకొక సిండికేట్ విలన్ తో కలిసి పోరాడబోతున్నట్టుగా తెలుస్తుంది.

అంటే ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.పుష్ప ఫహాద్ ఫాజిల్ ఇద్దరు కలిసి పోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే కొన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా క్లైమాక్స్ లో చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది.అందుకే సుకుమార్ కూడా ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పటివరకు ఏ సినిమాలో చూడని రేంజ్ లో ఉండబోతుంది అని ముందే హింట్ ఇచ్చేస్తున్నాడు.

మరి మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ రేంజ్ లో సక్సెస్ సాధించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు