సుమ క్యాష్ కార్యక్రమంలో తమన్నా కన్నీళ్లు పెట్టుకోవడానికి అసలు కారణం ఇదేనా?

బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని కొనసాగుతున్న కార్యక్రమాలలో క్యాష్ కార్యక్రమం ఒకటి.ఇక గత ఎపిసోడ్ తో ఈ కార్యక్రమం 200 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.

 Is This The Real Reason Why Tamanna Get Emotion On The Suma Cash Show , Thamann,-TeluguStop.com

ఇలా 200 ల ఎపిసోడ్ పూర్తి కావడంతో ఈ కార్యక్రమానికి ఎఫ్ 3 చిత్ర బృందం హాజరయ్యారు.ఈ క్రమంలోనే హీరోయిన్స్ సోనాల్ చౌహాన్, తమన్నా, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటుడు సునీల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమ వీరి చేత ఎప్పటిలాగే ఫన్ క్రియేట్ చేశారు.వీరితో కలిసి పలు రకాల టాస్క్ లను నిర్వహించారు.అయితే గతవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో తమన్నా కన్నీళ్లు పెట్టుకున్నట్లు చూపించారు.అయితే తమన్నా ఈ కార్యక్రమంలో కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ కావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

Telugu Sunil, Cash Show, Anil Ravipudi, Sonal Chauhan, Suma Cash Show, Tamannah,

ఈ కార్యక్రమంలో భాగంగా సుమ హీరోయిన్ సోనాల్ చౌహాన్, తమన్నాతో ఒక టాస్క్ నిర్వహించారు.ఈ టాస్క్ లో భాగంగా సుమ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మహానటి సావిత్రి లాగ ఎడమ కంటి నుంచి కన్నీళ్ళు కార్చాలని సుమ చెప్పారు.ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా సుమ తమన్నాను ప్రశ్నిస్తూ.వీరిద్దరిలో మీరు డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారని ప్రశ్నిస్తూ ఆప్షన్ ఏ ఎన్టీఆర్, ఆప్షన్ బి అల్లు అర్జున్ అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం చెప్పలేక మహానటి సావిత్రి మాదిరిగా ఎడమ కంటి నుంచి కన్నీళ్లను కార్చారు.ఇలా తమన్నా ఏడవటాన్ని ప్రోమోలో హైలెట్ చేసి ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెంచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube