కెసీఆర్ కు ఉన్న ఈ ఒక్క బలమే ప్రతిపక్షాలను దెబ్బతీస్తోందా?

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కష్టమనుకున్న తరుణంలో మరల భారీ ఎత్తున ఉద్యమం నిర్వహించి ఇక తప్పక తెలంగాణ ఇవ్వాల్సిందే అన్న రీతిలో వాతావరణం ఏర్పడింది.ఇక ఆ తరువాత తెలంగాణ ఏర్పడటం ఇదంతా జరిగిన పరిణామాలే.

 Is This Single Force Of Kcr Hurting The Opposition , Telangana Congress, Telanga-TeluguStop.com

అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.అయితే కెసీఆర్ పనితీరు రెండు సార్లు గెలుపొందడానికి ఒక కారణం కాగా బలమైన ప్రతిపక్షం తెలంగాణలో లేకపోవడం మరొక కారణంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

అయితే కెసీఆర్ కు ఉన్న ఒకే ఒక బలం వాక్చాతుర్యం.తాను చెప్పదలచుకున్నది ఇతర పార్టీల నేతలు చెప్పిన దాని కంటే వేగంగా ప్రజల్లోకి వెళ్లాడమే కాక ప్రజల్లో బలంగా నాటుకుపోతుంది.

తద్వారా తాను సాధించిన విజయాలు కావచ్చు ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతోనే కెసీఆర్ కు వరుస విజయాలు అనేవి వస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రతిపక్షాలు కెసీఆర్ ను ప్రత్యక్షంగా ఢీ కొనకుండా ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ రాజకీయంగా బలపడుతున్న పరిస్థితి ఉంది.

ఇప్పటి వరకు మౌనంగా ఉన్న కెసీఆర్ స్వయంగా తానే రంగంలోకి దిగడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు చాలా హాట్ హాట్ గా ఉండడమే కాక, అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పెద్ద ఎత్తున పేలే అవకాశం వందకు వంద శాతం ఉంది.అయితే కెసీఆర్ కు ఈ వాక్చాతుర్యం ప్రజలకు చెప్పే తీరు వాటిని ప్రజలు నమ్ముతున్న వరకు కెసీఆర్ ను రాజకీయంగా వెనక్కి నెట్టడం అంత సులభం కాదనేది ఎవరూ కాదనలేని సత్యం.

ప్రభుత్వ వైఫల్యాల వ్యూహం బీజేపీకి మంచిగా వర్క్ అవుట్ అవడంతో అదే వ్యూహాన్ని బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రయోగించే అవకాశం ఉంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube