ఈ ఎన్నికలు బి‌ఆర్‌ఎస్ కు గుణపాఠమేనా ?

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బి‌ఆర్‌ఎస్ ( Brs )కు ఈ ఎన్నికలు గునపాఠంగా మారబోతున్నాయా ? అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ తెచ్చిన కే‌సి‌ఆర్( KCR ) కు అధికారాన్ని కట్టబెట్టారు రాష్ట్రప్రజలు.ఆ తరువాత 2018 ఎన్నికలోను బి‌ఆర్‌ఎస్ కె పట్టంకట్టారు.కానీ ఈసారి మాత్రం పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి.నిన్న జరిగిన ఎన్నికల్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బి‌ఆర్‌ఎస్ కు ప్రతికూలంగా ఫలితాలను ఇచ్చాయి.దీంతో ఈసారి తెలంగాణలో అధికార మార్పు ఖాయమేనా అనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.

 Is This Election A Lesson For Brs , Brs, Congress, Kcr, Politics, Kcr, Dubbaka,-TeluguStop.com
Telugu Dharani, Assembly, Congress, Dubbaka, Ghmc, Huzurabad-Politics

గత కొన్నాళ్లుగా బి‌ఆర్‌ఎస్ పై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఎదురవుతువచ్చింది.దుబ్బాక, హుజూరాబాద్, జి‌హెచ్‌ఎం‌సి ( Dubbaka, Huzurabad, GHMC )ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.ఆ ప్రభావమే అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) కూడా కనిపించిందా అంటే అవుననే చెబుతున్నారు విశ్లేషకులు.సంక్షేమం అభివృద్ది సమపాళ్లలో అందిస్తున్నామని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నప్పటికి ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా పథకాలు ప్రజల వరకు చేరడంలేదనే విమర్శ గట్టిగా వినిపించింది.

Telugu Dharani, Assembly, Congress, Dubbaka, Ghmc, Huzurabad-Politics

కుటుంబ పాలన, కాళేశ్వరంలో అవినీతి, ధరణిలో భూ కభ్జాలు, డిల్లీ లిక్కర్ స్కామ్( Dharani, Delhi liquor scam ).వంటి ఆరోపణలు బి‌ఆర్‌ఎస్ ను గట్టిగానే దెబ్బతీశాయి.ప్రత్యర్థి పార్టీలు కూడా వీటిపైనే విమర్శలు గుప్పిస్తు బి‌ఆర్‌ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేయడంతో ఆ పార్టీ గ్రాఫ్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చిందనేది కొందరి అభిప్రాయం.పైగా కర్నాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ బలపడడంతో ప్రజల దృష్టి మార్పు వైపు మళ్లిందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే ఎగ్జిట్ పోల్స్ లో బి‌ఆర్‌ఎస్ అధికారం కోల్పోయే ఛాన్స్ ఉందని ఫలితాలు వెలువడ్డాయి.అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎంతవరకు సక్సస్ అవుతాయనేది చెప్పలేనప్పటికి.ఒకవేళ బి‌ఆర్‌ఎస్ కు ప్రతికూల ఫలితాలు వస్తే.ఈ ఎన్నికలు బి‌ఆర్‌ఎస్ కు గుణపాఠమే అని చెబుతున్నారు రాజకీయవాదులు.

మరి ఏం జరుగుతుందో చూడాలి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube