ఇదెక్క‌డి దారుణం.. ? ఎగ్ క‌ర్రీ వండ లేద‌ని యువ‌కుడు ఏం చేశాడంటే ?

ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్యా ఘ‌ట‌న‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఇందుకు కార‌ణాలు ఏవైనా అయి ఉండొచ్చు.

 Is This Bad   What Did The Young Man Do That Egg Curry Did Not Cook ,  Telangan-TeluguStop.com

చిన్న‌చిన్న వాటికే కొంద‌రు ప్రాణాలు తీసుకుంటున్నారు.క్ష‌ణికావేశంలోనే దారుణ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ఎదుటి వ్య‌క్తుల‌పై దాడి చేయ‌డ‌మో లేక వారికి వారే ప్రాణాలు తీసుకోవ‌డం లాంటి వాటికి పాల్ప‌డుతున్నారు.అయితే కోడికూర వండ‌లేద‌నో, ఇష్ట‌మైన ఆహారం చేసిపెట్ట‌లేద‌నో, త‌ను వండ‌మ‌న్న‌ది వండ‌లేద‌నో… ఇలా అనేక కార‌ణాల‌తో కుబుంబ సభ్యుల‌పైనే దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.

ఇటీవ‌ల ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కూన‌వ‌రంలో కోడికూర వండ‌లేద‌ని సొంత చెల్లినే వెంటాడి వేటాడి చంపిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న వెలుగు చూసింది.కానీ, ఇక్క‌డ కోడిగుడ్ల కూర వండ‌లేద‌ని ఓ యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

రాత్రి భోజ‌నానికి కోడిగుడ్ల కూర వండ‌లేద‌ని త‌ల్లిపై కోపంతో ఏకంగా ఉరేసుకున్నాడు.

మెద‌క్ జిల్లాలోని మ‌నోహ‌రాబాద్ మండంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

మండలంలో ని రంగాయ‌ప‌ల్లి గ్రామానికి చెందిన వ‌స్క‌రి న‌ర్సింహులు, సుశీల దంపతులకు ఇద్ద‌రు కొడుకులు.ఇందులో చిన్న‌కొడుకు మ‌ములేష్(19) కు ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో భుజానికి గాయ‌మైంది.

కొన్నిరోజుల పాటు ఏ ప‌ని చేయ‌కుండా ఇంట్లోనే ఉంటున్నాడు.ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రి మములేశ్ త‌ల్లి ఎగ్ క‌ర్రీ వండ‌లేద‌ని ఇంటిలోంచి వెళ్లిపోయాడు.

తిరిగి వ‌చ్చి కూర వండ‌మ‌ని మ‌ళ్లీ అడిగాడు.కాగా త‌ల్లి గుడ్లు లేవ‌ని, ఇప్పుడు వండ‌న‌ని చెప్పింది.

దీంతో తల్లితో గొడ‌వ‌ప‌డ్డాడు.ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

తిరిగి ఎంత‌కూ రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆచూకి వెతికినా లాభం లేకుండా పోయింది.బుధ‌వారం గ్రామ స‌మీపంలోని మ‌హంకాళీ ఆల‌యం స‌మీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు గుర్తించారు.

తండ్రి న‌ర్సింహ‌లు ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube