టీ కాంగ్రెస్‌కు ఎప్పుడైతే రేవంత్‌రెడ్డి ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి పార్టీలో కొంత జోష్ పెరిగిందనే చెప్పాలి.ఆయన చేస్తున్న వరుస నిరసనలు అలాగే ఇప్పుడు దళిత, గిరిజన దండోరా లాంటి కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు.
కాగా ఆయన పగ్గాలు తీసుకున్న తర్వాత ప్రతిపక్షాల నుంచి ఒక బలమైన విమర్శ వస్తోంది.అదేంటంటే ఆయన చంద్రబాబుకు ఏజెంట్ అని ఆయన్ను టీపీసీసీ ప్రెసిడెంట్ చేసిందే చంద్రబాబు నాయుడు అని ఇటు టీఆర్ ఎస్ అటు బీజేపీ కూడా విమర్శిస్తున్నాయి.
అయితే ఈ విమర్శలపై పెద్దగా రేవంత్‌రెడ్డి స్పందించట్లేదు.ఇంకా చెప్పాలంటే కనీసం అవి నిజం కాదని కూడా నిరూపించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో ఇప్పుడు జరిగిన ఓ ఘటన టీ కాంగ్రెస్‌కు ఇబ్బందులు తెచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది.ఎందుకంటే సోషల్ మీడియా కంట ఏ ఫొటో అయినా లేదంటే వీడియో అయినా సరే ఇట్టే వైరల్ అవడాన్ని మనం చూడొచ్చు.
ఇక ఇదే క్రమంలో రీసెంట్ గా హైదరాబాద్ లో సీనియర్ నేత అయిన శైలజానాథ్ కొడుకు పెండ్లి వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

అయితే ఇదే కార్యక్రమానికి టీ కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు.కాగా ఈ వేడుకలో చంద్రబాబు పక్కనే తెలంగాణ కాంగ్రెస్ లో మంచి పొజీషన్ లో ఉన్నటువంటి మధు యాష్కీ ఒకే సీట్లో కూర్చుని ముచ్చటించడం కెమెరాల కంట పడింది.వారిద్దరూ చాలా సేపు ఏవేవో విషయాలపై మాట్లాడుకున్నారు.
ఓ వైపు చంద్రబాబుతో రికమండేషన్ తోనే రేవంత్ కు టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పదవి వచ్చిందని విమర్శస్తున్న టైమ్‌లో ఇలాంటి ఫొటోలు వైరల్ కావడం కూడా టీ కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పక తప్పదు.చూడాలి మరి ప్రతిపక్షాలు ఏం చేస్తాయో.