తాజా వెర్షన్‌ చాట్‌జిపిటి 4 లాంచ్‌ కాబోతోందా? ఇక మనుషులు సర్దుకోవలసిందేనా?

టెక్నాలజీ రంగంలో నేడు బాగా వినబడుతున్న పేరు చాట్‌జిపిటి( ChatGPT ).అవును, రిలీజైన నాలుగు నెలలలోనే చాట్‌జిపిటి తన సత్తా చాటిందని అందరికీ తెలిసినదే.

అయితే దీని సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయిన వాళ్లున్నారు, అదేవిధంగా ఆరోపణలు చేసినవారు కూడా లేకపోలేదు.తాజాగా మరింత మెరుగైన లేటెస్ట్‌ వెర్షన్‌ చాట్‌జిపిటి ప్లస్‌ లేదా జిపిటి-4( ChatGPT 4 ) ని ఓపెన్ ఏఐ కంపెనీ అనౌన్స్‌ చేయడం విశేషం.

చాట్‌జిపిటి ముందు వెర్షన్‌లలోని లోపాలను అధిగమిస్తూ మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ అందించేలా ఈ -4ని రూపొందించినట్లు తెలుస్తోంది.

చాట్‌జిపిటి అనేది అచ్చం మనిషిలాగే కొన్ని పనుల్లో విశేష సేవలు చేయగలదు.ఇది ఇమెయిల్స్, క్యాలెండర్లను( Emails, calendars ) విశ్లేషించగలదు.ఇది అడ్వాన్స్‌డ్‌ వర్చువల్ అసిస్టెంట్‌గా పని చేస్తుందనే విషయం అందరికీ తెలిసినదే.

Advertisement

రోజువారీ వర్క్‌ ప్లాన్స్‌ రూపొందించడానికి ఇమెయిల్‌లు, క్యాలెండర్‌లను విశ్లేషించడానికి చాట్‌జిపిటి ఉపయోగపడుతుంది.అంతేకాకుండా క్రియేటివ్‌, టెక్నికల్‌ రైటింగ్‌ టాస్క్‌లలో సహాయపడుతుంది.

కంటెంట్‌( Content ) జనరేట్‌ చేయగలదు, అదేవిధంగా సమర్ధవంతంగా ఎడిట్‌ కూడా చేయగలదు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే పాటలను కంపోజ్ చేయగలదు అదే విధంగా స్క్రీన్‌ప్లేలు రాయడం లేదా యూజర్ రైటింగ్ స్టైల్‌ను నేర్చుకోవడం వంటివి చేస్తుంది.అంతేకాకుండా మీకు

చాట్‌జిపిటి హోంవర్క్‌ చేయడంలో సహాయపడుతుంది.అయితే దీనిపై చాలా వర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.గూగుల్ లెన్స్ మాదిరిగానే టెక్స్ట్-బేస్డ్‌ ఇన్‌ఫర్మేషన్‌ని అందిస్తుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

వినియోగదారులు వస్తువులను గుర్తించడానికి లేదా ఫోటోలోని పాఠాలను అర్థం చేసుకోవడానికి ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయవచ్చు.ఇది స్థానిక భాషలో టైప్ చేయడానికి ఇష్టపడే వారికి కూడా సహకరిస్తుంది.

Advertisement

తాజా వార్తలు