ముఖ్యమంత్రి పదవి రెడ్డి గారికి కత్తి మీద సామేనా?

తన అసమాన్య పట్టుదల, కృషితో అత్యంత తక్కువ సమయంలోనే మహాసముద్రం లాంటి కాంగ్రెస్లో సీనియర్ నాయకులు అందరిని పక్కనపెట్టి తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోవడంలోనూ ,దానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించడంలోనూ సంపూర్ణం గా విజయం సాదించిన రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఈరోజు ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి పదవికి ఎన్నికయ్యాడు.అయితే ఇంతటితో కధ పూర్తి అయిపోలేదని, ఇకపైనే అసలు సినిమా రేవంత్ కు కనిపిస్తుందంటూ కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు .

 Is The Chief Minister's Position Is Not A Cake Walk For Reddy, Revanth Reddy ,-TeluguStop.com
Telugu Rahul Gandhi, Revanth Reddy, Rythu Bharosa-Telugu Political News

ఎందుకంటే కాంగ్రెస్ విజయం సాధించడం వెనక కీలకంగా పనిచేసిన ఆరు హామీలను ఇప్పుడు రేవంత్ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం అధికంగానే ఉండడంతో ఉద్యోగుల జీతాలను కూడా సమయానికి ఇవ్వలేకపోతున్న పరిస్తితి కనిపిస్తుంది .ఇలాంటి సమయంలో రెండు లక్షల వరకు రుణమాఫీ, 15 వేల వరకు రైతు భరోసా( Rythu Bharosa ) , చేయూత కింద 4000 పెన్షన్లు తో పాటు మహిళల కు నెలకు 2000 మరియు ఇతర హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ కు ఆచరణ లో సాధ్యం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి .

Telugu Rahul Gandhi, Revanth Reddy, Rythu Bharosa-Telugu Political News

పోనీ ఐదు సంవత్సరాల వరకూ ఏదోలా మేనేజ్ చేయడానికి కూడా లేకుండా మరో నాలుగైదు నెలలలోనే పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలను తన పరిపాలన సామర్థ్యంతో సంతృప్తి పరచకపోతే మాత్రం రేవంత్ పనితీరుపై తెలంగాణ ప్రజలతోపాటు కాంగ్రెస్ హై కమాండ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది.దాంతో కఠినమైన ఈ పరిస్థితుల్లో రేవంత్ ఎంత లౌక్యంగా నెగ్గుకు రాగలరు అన్న దానిని బట్టి ఆయన ముఖ్యమంత్రి పదవి కొనసాగింపు ఆధారపడి ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు.ఒక్కసారి పార్లమెంట్ గండాన్ని గనక రేవంత్ గట్టెక్కిస్తే మరో ఐదు సంవత్సరాల వరకు తిరుగులేని విజేతగా పరిపాలించవచ్చన్నది రాజకీయ విశ్లేషకులు మాట .మరి ఇప్పటికే అనేక డక్కా మొక్కీలు తిన్న నేత గా పేరు తెచ్చుకున్న రేవంత్ కు ఇదంతా కొట్టిన పిండి అని రేవంత్ వర్గం వాదిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube