తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బిజెపిలో హైలెట్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు గానే కనిపిస్తున్నారు.తాను బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ తెలంగాణలో బలపడడం, టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించే స్థాయికి చేరడం ఇవన్నీ తన గొప్పతనం గానే సంజయ్ భావిస్తున్నారు.
హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిపించుకోవడం.ఇవన్నీ తన గొప్పతనం గానే సంజయ్ భావిస్తున్నారు.
వాస్తవంగానే సంజయ్ తెలాంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో బిజెపి బలం పుంజుకుంది.బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో జరగనున్నాయి.
రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు.ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు.
దీంతో ఈ సమావేశాల్లోనే తాను మరింత ఫోకస్ అయ్యే విధంగా అందరి దృష్టిలో పడేందుకు సంజయ్ ప్రయత్నిస్తున్నారు.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు 33 కమిటీలను నియమించారు.ఈ కమిటీలో ఉన్న వారంతా సంజయ్ అనుచరులే.
ఈ ముప్పై మూడు కమిటీలతో రోజుకు రెండు చోట్ల ఏదో ఒక కార్యక్రమం ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నారు.ఒక రోజు జనసమీకరణ సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు జిల్లాల పర్యటనకు వెళుతున్నారు .ఇంకో రోజు ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్నారు.ఈ సందర్భంగా మీడియాలో ఫోకస్ అయ్యేవిధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మూడు వందలమంది పాల్గొనబోతున్నారు .

ఈ సభ ద్వారా ప్రధాని దృష్టిలో పడేందుకు సంజయ్ ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే ఈ సభను సక్సెస్ చేసే నిమిత్తం యాభై లక్షల మందికి ఆహ్వానాలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు.కనీసం పది లక్షల మందితో సభ నిర్వహించేందుకు , సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నవారికి టార్గెట్లు విధిస్తూ తను గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుండడంతో బిజెపిలో సంజీవ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.