టాలీవుడ్ లో కొంతమంది ఆర్టిస్టులలో చాలా మార్పులు వచ్చాయి.ముఖ్యంగా తమ వేషధారణ విషయంలో బాగా మారిపోయారు.
బాగా గమనిస్తే ఎవరైతే ఫిమేల్ ఆర్టిస్టులు బిగ్ బాస్( Big Boss ) షోలో పాల్గొన్నారో వాళ్లలో బిగ్ బాస్ తర్వాత మామూలు మార్పు రాలేదని చెప్పాలి.ఇప్పటికే అషు రెడ్డి, అరియానా, బిందు మాధవి, శివ జ్యోతి, దీప్తి సునయన, శ్రీముఖి, యాంకర్ స్రవంతి ఇలా చాలామంది బిగ్ బాస్ ముందు పద్ధతిగా కనిపించగా బిగ్ బాస్ తర్వాత మాత్రం తమ అందాలను ఓ రేంజ్ లో బయటపెడుతున్నారు.
ఇక అందులో ఒకరు హరితేజ ( Hariteja )అని కూడా చెప్పాలి.ఈమధ్య హరితేజలు వచ్చిన మార్పు అంతా ఇంతా కాదు.
ఒక సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన హరితేజ బాగా అందాలను ఆరబోస్తూ అందరిచే బాగా ట్రోల్స్ ఎదురుకుంటుంది.అయితే ఈమె ఇలా రెడీ కావడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.
ఇంతకు అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బుల్లితెర, వెండితెర ( Big screen, silver screen )ఆర్టిస్ట్ గా కొంత గుర్తింపు తెచ్చుకుంది హరితేజ.అంతేకాకుండా యాంకర్, డాన్సర్ కూడా.ఇక ఈమె తొలిసారిగా 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.
ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.తన నటనకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.2011లో బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
అంతేకాకుండా బుల్లితెరపై పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.

ఇక ఈమెకు పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.అంతేకాకుండా బాగా సన్నబడింది కూడా.దీంతో గ్లామర్ షో చేయటానికి కూడా సిద్ధమయింది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా అరాచకం చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు పంచుకుంది.
అందులో తను షార్ట్ డ్రెస్ వేసుకొని తన కూతురితో బాగా చిల్ అవుతూ కనిపించింది.ఇక ఆమె ఫోటోలు చూసినెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్బాస్ ముందు స్లీవ్ లెస్ డ్రెస్ వేయటానికే ఇబ్బందిగా ఫీలైన హరితేజ.ఇప్పుడేంటో కొత్తగా తయారవుతుంది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.
వెంటనే మరో నెటిజన్.కొత్తగా ఫిట్ అయింది.
స్ట్రాంగ్ అయ్యింది.అందుకే తనకు కాన్ఫిడెంట్ వచ్చింది అంటూ కామెంట్ చేశారు.
అంటే తనలో ఒక కాన్ఫిడెంట్ వచ్చింది కాబట్టి గ్లామర్ షో చేస్తుందని అర్థమవుతుంది.







