Nani Mahesh Babu: మహేష్ బాబుకు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడని మీకు తెలుసా.. ఆ మూవీ ఏదంటే?

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని( Nani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు నాని.

 Is That The Only Film Where Nani Worked As An Assistant Director To Mahesh Babu-TeluguStop.com

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక చివరిగా దసరా సినిమాతో( Dasara Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

కాగా నాని మొదట డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత ప్రముఖ స్టార్ డైరెక్టర్స్ అందరికీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.

Telugu Arjun, Ashta Chamma, Assistant, Gunasekhar, Nani, Mahesh Babu, Nani Assis

అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో నాని ఎన్నో అవమానాలను కూడా ఎదురుకోవాల్సి వచ్చిందని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఒక స్టార్ డైరెక్టర్ అయితే నువ్వు దర్శకత్వంకి మాత్రమే కాదు, అసలు దేనికి పనికిరావు అని అందరి ముందు అవమానించాడు అంటూ నాని చెప్పుకొచ్చాడు.అలా సాగుతున్న ఆయన కెరీర్ సురేష్ బాబు తెరకెక్కించిన అష్టా చమ్మా సినిమాలో( Ashta Chamma Movie ) హీరోగా నటించే అవకాశం ఇచ్చింది.

ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నాని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Telugu Arjun, Ashta Chamma, Assistant, Gunasekhar, Nani, Mahesh Babu, Nani Assis

అయితే నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించిన సినిమాకి కూడా పని చేసే అవకాశం దక్కింది అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.అప్పట్లో ఆయన ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ కి చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.అలా ఆయన మహేష్ బాబుని హీరోగా పెట్టి చేసిన అర్జున్ చిత్రానికి( Arjun Movie ) నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.

చాలా సన్నివేశాలకు గుణ శేఖర్ లేని సమయంలో మహేష్ బాబుకి సన్నివేశాలను వివరించే వాడట.అలా ఆ రోజుల్లో ఆయన మహేష్ బాబు సినిమాతో పాటుగా, ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు పని చేసారు నాని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube