బిజెపి మేనిఫెస్టో తేలిపోయిందా ?

రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం గా బావించే రాజకీయ పార్టీలు అమలు చేసినా చేయకపోయినా ప్రజలను ఆశల పల్లకి ఎక్కించే హామీలకు మాత్రం లోటు రానివ్వకుండా చూసుకుంటాయి.చేసిన వాగ్దానాలకు వాటి అమలు చెయ్యడానికి మద్య హస్తీమశకాంతరం తేడా ఉన్నా కూడా ప్రతిసారి ఎన్నికలు( Elections ) వచ్చినప్పుడు ఇది చెట్టుమీద బేతాళుడు కథలా ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది .

 Is Telangana Bjp Manifesto Not Effective Details, Bjp, Telangana Bjp, Telangana-TeluguStop.com

దానికి తగ్గట్టే కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టుగా మానిఫెస్టో లు( Manifesto ) విడుదల చేశాయి .బారి ఎత్తున హామీలు గుప్పించాయి.బిజేపి( BJP ) నుండి కూడా ఆ స్తాయి లో మానిఫెస్టో విడుదలవుతుందని అందరూ ఆశించారు.అయితే బజాపా మేనిఫెస్టో మాత్రం ఆ స్తాయి లో లేదని తెలుస్తుంది ప్రజల్లో ఈ మానిఫెస్టో పై మిశ్రమాలు స్పందన వస్తుందట .తనదైన ప్రత్యేకతను చూపించే ఒక హామీని కూడా బిజెపి ప్రకటించలేదని ఆ రెండు పార్టీలలో కీలకంగా ఉన్న హామీలను కాపీ కొట్టినట్లుగా బిజెపి ఎన్నికల మేనిఫెస్టో( BJP Manifesto ) ఉందంటూ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu Amit Shah, Brs Manifesto, Congress, Janasena Bjp, Kishan Reddy, Revanth R

ధరణి పోర్టల్ మార్పు, వరికి మద్దతు ధర, బిఆర్ఎస్ నాయకుల కుంభకోణాలపై విచారణ వంటి వాటిపై ఇప్పటికే కాంగ్రెస్( Congress ) హామీ ఇచ్చింది వాటిని బిజెపి రిపీట్ చేసింది .ఇది కాకుండా రైతులకు పంట బీమా, కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణకు వర్తింపు, పసుపు బోర్డు( Turmeric Board ) ఏర్పాటు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ధర తగ్గింపు, ఆసక్తి కలిగిన రైతులకు ఉచితంగా దేశీయ ఆవుల పెంపకం, ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు వంటివి బిజెపి ఇతర హామీలుగా కనిపిస్తూ ఉన్నాయి.అయితే కాంగ్రెస్ కి ఆరు గ్యారెంటీలు మరియు టిఆర్ఎస్ కు పెన్షన్ల పెంపు రైతుబంధు పరిమితి పెంపు మహిళలకు ఆర్థిక మద్దతు వంటి అంశాలను బిజెపి కూడా ప్రకటించి ఉంటే ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉండేదని తన కానీ అవకాశాన్ని బాజాప సరిగా వాడుకోలేదని కూడా విశ్లేషణలు వస్తున్నాయి.

Telugu Amit Shah, Brs Manifesto, Congress, Janasena Bjp, Kishan Reddy, Revanth R

ఏది ఏమైనా కొన్ని ప్రత్యేకమైన సీట్లను మాత్రమే టార్గెట్ గా పెట్టుకున్న బిజెపి దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతుందని ఆయా నియోజకవర్గాలలో తమ అభ్యర్థి గెలుపుకు ఉపయోగపడే వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసి పేట్టుకుందని వార్తలు వస్తున్నాయి .కనీసం 15 నుంచి 20 స్థానాలు గెలిస్తే తెలంగాణ లో చక్రం తిప్పవచ్చన్న ధీమా కమలనాధులలో కనిపిస్తుంది.జనసేన( Janasena ) మద్దతుకు తోడు కమల శ్రేణులు గట్టిగా కష్టపడితే టార్గెట్ పెద్ద దూరంగా ఏమీ లేదన్నది బిజేపి గా వ్యూహంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube