జబర్దస్త్ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ).ఈయనకి ఉన్న క్రేజ్ ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఈయనకి ఉన్న ఫాలోయింగ్ చాలా మంది మీడియం రేంజ్ హీరోలకు కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆ ఫాలోయింగ్ కారణంగానే సుధీర్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు పలువురు దర్శకులు మరియు నిర్మాతలు ఆయన్ని హీరో గా పెట్టి సినిమాలు తియ్యడానికి ముందుకు వచ్చారు.
మొదటి సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్ కి పెద్దగా టాక్ రాకపోయినా కూడా కలెక్షన్స్ పరంగా యావరేజ్ గా నిల్చింది.ఇక రెండవ సినిమా ‘3 మంకీస్‘ విడుదలైనట్టు ఆడియన్స్ ఎవ్వరికీ తెలియదు, అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
కానీ మూడవ సినిమా ‘గాలోడు‘ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద కమర్షియల్ సక్సెస్ గా నిల్చింది.
ఈ సినిమా తర్వాత సుధీర్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాలింగ్ సహస్ర( Calling Sahasra )’ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా సుధీర్ పలు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వాస్తవానికి ఈ చిత్రం అడవి శేష్ ( Adivi Sesh )గారు చెయ్యాల్సింది.కానీ ఆయన డేట్స్ అందుబాటులో లేకపోవడం తో నన్ను ప్రత్యేకంగా ఈ చిత్రానికి రికమెండ్ చేసాడు.
అలా ఈ అద్భుతమైన కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమా నా చేతికి వచ్చింది.కచ్చితంగా మీ అందరినీ ఈ చిత్రం అలరిస్తుందని నమ్ముతున్నాను.డైరెక్టర్ అరుణ్ విక్కీరాల( Arun Vikkirala ) గారు ఎంతో ఆసక్తికరంగా ఉండేట్టు ఈ సినిమాని తెరకెక్కించాడు.నా మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే, మరోపక్క మంచి థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఈ సినిమాలో ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు సుడిగాలి సుధీర్.
రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ సినిమా సుధీర్ కెరీర్ ని మలుపు తిప్పే చిత్రం అవుతుందని అనిపిస్తుంది.ఒకవేళ కమర్షియల్ గా ఈ సినిమా ఆయన కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాత్రం సుధీర్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో పడుతాయి.
కానీ ఈ సినిమా ప్రతిష్టాత్మక ‘ఎనిమల్’ చిత్రం తో పోటీ పడబోతోంది.ఆ సినిమా ప్రభావం ఈ చిత్రం పై పడే ఛాన్స్ ఉంది.
కానీ మౌత్ టాక్ ఉంటే మాత్రం కాలింగ్ సహస్ర కమర్షియల్ గా కచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని మేకర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు.