ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వైస్ షర్మిల( ys Sharmila ) రాజకీయంగా తప్పుటడుగులు వేస్తున్నారనే సందేహాలు వైస్ కుటుంబ సన్నిహితుల నుంచే వ్యక్తం అవుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని( YSR Congress Party ) స్థాపించి ఎన్నికల సమయంలో పోటీకి దూరంగా ఉన్న షర్మిల, పూర్తిగా పార్టీని పక్కనపెట్టి కాంగ్రెస్ లో చేరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.
తెలంగాణలో ఉన్న సమయంలో పూర్తిగా తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ( Paleru Assembly Constituency )నుంచి పోటీ చేస్తానని, తాను తెలంగాణ కోడలని అంటూ చెప్పుకున్న షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి సంచలనంగా మారారు.ఆమె ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వగానే తన అన్న జగన్ ను టార్గెట్ చేసుకున్నారు.
రాజకీయంగాను, వ్యక్తిగతంగాను సంచలన విమర్శలు చేస్తున్నారు.
జగన్ రెడ్డి అంటూ షర్మిల మాట్లాడుతున్న తీరుపై వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతంలో కాంగ్రెస్, టిడిపిలను తీవ్రస్థాయిలో విమర్శించిన షర్మిల నేడు ఆ పార్టీలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ, తన అన్నను అన్న పార్టీని విమర్శిస్తున్నారు.జగన్ తో పాటు, షర్మిలను అభిమానిస్తూ వస్తున్న వైఎస్ అభిమానులకు షర్మిల నిర్ణయం ఇప్పటికీ మింగుడు పడడం లేదు.
రాజశేఖర్ రెడ్డి పేరును చెడగొట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని వారు మండిపడుతున్నారు.
గతంలో తన కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్( Congress ) లో చేరడం షర్మిల చేసిన పెద్ద తప్పు అని, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ను ఎఫ్ ఐ ఆర్ లో పెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు, తన అన్న జగన్ ను అక్రమస్తుల కేసులో ఇరికించి జైల్లో పెట్టిన కాంగ్రెస్ లో షర్మిల చేరాల్సిన అవసరం ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు .రాజకీయంగా జగన్ ఇరుకును పెట్టేందుకు ప్రయత్నిస్తూ, వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసుకోవడంపై షర్మిల తీవ్ర విమర్శలు పాలవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో పాటు, జగన్, వైసీపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు, వ్యక్తులకు మద్దతుగా ఉంటూ జగన్ ను విమర్శించడంపై ఆమె విమర్శల పాలవుతున్నారు.